PSLV-C60 SpaDex: చందమామపై భారత్‌ మరో ముందడుగు.. స్పేడెక్స్‌ ప్రయోగం సక్సెస్‌

PSLV-C60 SpaDex Successfully Launched For Space Docking: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024ను విజయంతో ముగించింది.  ఇస్రో విజయాల పరంపరను కొనసాగించింది. ఈ ఏడాది ఆఖరున చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్‌ ప్రయోగం విజయంతమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 30, 2024, 11:11 PM IST
PSLV-C60 SpaDex: చందమామపై భారత్‌ మరో ముందడుగు.. స్పేడెక్స్‌ ప్రయోగం సక్సెస్‌

  PSLV-C60 SpaDex Mission Success: అంతరిక్షంలో వరుస విజయాలు పొందుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏడాది చివర్లోనూ విజయం సాధించి 2024కు ఘనంగా ముగింపు పలికింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్‌ మిషన్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం రాత్రి చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోలో సంబరాలు అంటాయి. పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ రెండు కృత్రిమ ఉపగ్రహాలను చేజర్ (ఎస్‌ఎక్స్‌ 01), టార్గెట్‌ (ఎస్‌డీఎక్స్‌02)లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి, ప్రధాని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రోను, ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు.

Also Read: New Year Alert: న్యూ ఇయర్‌కు బిగ్‌ అలర్ట్‌.. హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు మూసివేత

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరులోని శ్రీహరి కోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం రాత్రి సరిగ్గా 10 గంటల 15 నిమిషాలకు ప్రయోగం ఇస్రో చేపట్టింది. అమావాస్య రాత్రిలో నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి రాకెట్‌ దూసుకెళ్లింది. పీఎస్‌ఎల్‌వీ సీ-60 రాకెట్ రెండు కృత్రిమ ఉపగ్రహాలను చేజర్ (ఎస్‌ఎక్స్‌ 01), టార్గెట్‌ (ఎస్‌డీఎక్స్‌02)లను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన రెండు ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంది. స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక ప్రయోగం ఇది. స్పేస్‌క్రాఫ్ట్‌ను డాకింగ్, అన్‌డాకింగ్ చేసేందుకు అవసరమైన టెక్నాలజీ అభివృద్ధి, ప్రదర్శన స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పీఎస్‌ఎల్వీ ద్వారా ప్రయోగించిన రెండు చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింక్‌ చేయించడం ఈ మిషన్‌ ప్రధాన లక్ష్యమని అని తెలిపారు.

Also Read: Sreeleela Video: తప్పుడు ప్రచారం.. ఫేక్‌ న్యూస్‌పై శ్రీలీల మాస్‌ వార్నింగ్‌

చందమామపై మానవాళి కాలు మోపేందుకు చేసే ప్రయోగంలో భాగంగా తాజా ప్రయోగం చేపట్టారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం.. చంద్రుడు నుంచి మట్టిని తీసుకురావడం.. సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలనే లక్ష్యంలో భాగంగా వ్యోమ నౌకల డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది. డాకింగ్‌, అన్‌ డాకింగ్‌ కోసం చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ సాంకేతికతను కలిగిన నాలుగో దేశంగా భారత్‌ ఖ్యాతి పొందునంది. ఈ సాంకేతికతను ఇప్పటికే అమెరికా, రష్యా, చైనా దేశాలు కలిగి ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

Trending News