PSLV-C49: ISRO ప్రయోగించిన PSLVC49 విజయవంతం.. నింగిలోకి ఒకేసారి 10 ఉపగ్రహాలు

ISRO successfully launches PSLVC49: శ్రీహరికోట: ఇస్రో విజయాల ఖాతాలో మరో విజయం నమోదైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ( SHAR-ISRO) నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వి-సీ49 ( PSLV-c49) రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం జరిగిన 15 నిమిషాల అనంతరం రాకెట్ మోసుకెళ్లిన 10 శాటిలైట్స్‌ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Last Updated : Nov 7, 2020, 04:51 PM IST

రాకెట్ మోసుకెళ్లిన ఉపగ్రహాల్లో ఒకటి భారత్‌కి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ( EOS-01) కాగా మరో 9 ఉపగ్రహాలు విదేశాలకు చెందినని ఉన్నాయి. విదేశీ ఉపగ్రహాల్లో లిత్వేనియాకు చెందిన 2 R2 శాటిలైట్స్, లగ్జంబర్గ్ చెందిన నాలుగు క్లియోస్ (KSM-1A/1B/1C/1D satellites ) శాటిలైట్స్, అమెరికాకు చెందిన నాలుగు లెమూర్ (Lemur-1/2/3/4 satellites) ఉన్నాయి. Also read : US Election Results: ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ జో బిడెన్‌దే ఆధిక్యం

తొలుత భారత్‌కి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ( EOS-01)ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం మిగతా 9 ఉపగ్రహాలను కూడా పీఎస్ఎల్వీ-C49 విజయవంతంగా ఆర్బిట్‌లోకి ఇంజెక్ట్ చేసింది. 

కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ అనంతరం ఇస్రో చేసిన తొలి ఉపగ్రహ ప్రయోగం ఇదే. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాకెట్ 3.02 గంటలకు ఉపగ్రహ ప్రయోగం చేయాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షం కారణంగా మిషన్ డైరెక్టర్ ఈ ప్రయోగాన్ని 10 నిమిషాలు వాయిదా వేసినట్టు ఇస్రో ప్రకటించింది.

దీంతో 10 నిమిషాలు ఆలస్యంగా 3.12 గంటలకు పీఎస్ఎల్వీ-సీ49ని లాంచ్ చేశారు. 

Also read : India Covid-19: 78 లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News