Jamili Election Bill: జమిలి ఎన్నికలకు అంతా సిద్ధమౌతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్ ఆమోదం మిగిలింది. డిసెంబర్ 16 సోమవారం పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఎప్పుడా అని ఆసక్తి కల్గిస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంట్‌కు రానుంది. ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం పలకడంతో ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసేసింది. డిసెంబర్ 16 సోమవారం నాడు వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టనున్నారు. మొదటి సవరణ బిల్లును లోక్‌సభలో రెండవ సవరణ బిల్లును ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీల్లో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బిల్లుపై చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకు పంపించనున్నారు.
రాజ్యాంగ సవరణ, ఆమోదం కోసం పొందాల్సి ఉంది. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెర్రిటరీస్ యాక్ట్ 1963, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ యాక్ట్ 1991, జమ్ము కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2019 సవరణ చేయాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ నివేదికను ఆమోదించాక తాజాగా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు విడివిడిగా జరుగుతున్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో రెండూ ఒకేసారి జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు హర్యానా, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఎన్నికలు జరిగాయి.
Also read: PF Money Withdrawal: పీఎఫ్ నగదు అడ్వాన్స్ విత్ డ్రా ఎలా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఇలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.