తిరుమలలో మెరిసిన జాన్వీ కపూర్

అలనాటి అందాల తార స్వర్గీయ  శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.

Updated: Feb 10, 2020, 10:09 PM IST
తిరుమలలో మెరిసిన జాన్వీ కపూర్

అమరావతి: అలనాటి అందాల తార స్వర్గీయ  శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.



View this post on Instagram


🌈🌞

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

 

అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు జాన్వీకి వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు జాన్వీకి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దిగిన ఫోటోలను జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’, ‘రూహీఅఫ్జా’ అనే రెండు చిత్రాలల్లో నటిస్తూ బిజీగా ఉంది.

కరణ్ జోహార్ నిర్మించబోతోన్న 'గుంజన్ సక్సేనా' ది కార్గిల్ గర్ల్, 'రూహిఅఫ్జా' అనే రెండు చిత్రాల చిత్రీకరణలో జాన్వి బిజీగా ఉన్నారని చిత్ర బృందం తెలిపింది. 1999లో కార్గిల్ నుండి గాయపడిన సైనికులను విమానంలో ఎక్కించడంలో భారతీయ వైమానిక దళ పైలట్ 'గుంజన్ సక్సేనా' కీలక పాత్ర పోషించారు. రెండవది, హర్రర్ కామెడీ ఉంటుందని, ఇందులో జాన్వీ ద్విపాత్రాభినయం ఉంటుందని తెలిపారు.

కరణ్ జోహార్ నిర్మించబోతోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం, తఖ్త్ లో కూడా జాన్వీ నటించనుంది. ఇందులో కరీనా కపూర్ ఖాన్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, భూమి పెడ్నేకర్, అనిల్ కపూర్ నటించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..