జియో దీపావళి ఆఫర్ : 399 రీఛార్జ్ తో 100 % క్యాష్ బ్యాక్

Last Updated : Oct 13, 2017, 03:24 PM IST
జియో దీపావళి ఆఫర్ : 399 రీఛార్జ్ తో 100 % క్యాష్ బ్యాక్

టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న జియో.. వినియోగదారుల కోసం తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే ధన్ ధనా ధన్ ఆఫర్ తో తక్కువ ధరకే డేటా అందిస్తున్న జియో..దీపావళి పండగను పురస్కరించుకొని సరికొత్త ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో రూ.399తో రీఛార్జ్‌ చేసుకుంటే 100 శాతం క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనుంది.  ఈ బంపర్ ఆఫర్ ఈ రోజు నుంచి అక్టోబర్ 18 వరకు కొనసాగనుంది.

వోచర్ల రూపంలో క్యాష్ బ్యాక్

జియో ఇచ్చే క్యాష్ బ్యాక్.. వోచర్ల రూపంలో ఉండనుంది. రూ.399 రిచార్జ్ చేయిస్తే..మొత్తం  రూ. 400 విలువ గల 8 వోచర్లను అందిస్తున్నది. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది.  వీటిని మళ్లీ రీఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఇలా వచ్చిన వోచర్లను నవంబర్ 15వ తేదీ తరువాతే వినియోగించుకోవాలి.  అయితే రూ.309 అంతకంటే ఎక్కువ ప్లాన్‌కు మాత్రమే ఈ వోచర్లు వర్తిస్తాయి. 

 

 

Trending News