న్యూ ఢిల్లీ: యూనివర్శిటీలో హాస్టల్ ఫీజు పెంపుని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు ప్రముఖ మీడియా సంస్థ జీ న్యూస్‌పై సైతం నిరసన వ్యక్తంచేశాయి. ఆందోళనలపై గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి వెళ్లిన జీ న్యూస్ మీడియా ప్రతినిథిపై దురుసుగా ప్రవర్తించిన జేన్‌యూ విద్యార్థి సంఘాలు... జీ న్యూస్‌కి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించాయి.
జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు జీ మీడియా సంస్థకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఇదేం మొదటిసారి కాదు. నవంబర్ 15న జరిగిన ఆందోళనలను కవర్ చేయడానికి వెళ్లిన జీ మీడియా ప్రతినిథులు పూజా మక్కర్, కవిత శర్మలపై సైతం విద్యార్థులు ఈ తరహాలోనే ప్రవర్తించారు. వారి కెమెరా మెన్లను వెనక్కి నెడుతూ జీ మీడియా ప్రాపర్టీని ధ్వంసం చేసేందుకు యత్నించారు.