Kamal Haasan On Bharat Jodo Yatra: ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మక్కల్ నీది మయ్యం అధినేత, నటుడు కమల్ హాసన్ కీలక విషయాలు వెల్లడించారు. కోజికోడ్‌లో జరిగిన 6వ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ముగింపులో కమల్ హాసన్ మాట్లాడుతూ.. తాను ఐక్య భారతదేశం కోసం భారత్ జోడో యాత్రలో చేరానని అన్నారు. జోడో యాత్రలో పాల్గొన్నందుకు తాను కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నానని భావించకూడదని.. ఏ పార్టీ వైపు మొగ్గు చూపడం లేదని క్లారిటీ ఇచ్చారు.
'1970లలో నాకు రాజకీయాలపై ఇంత అవగాహన ఉంటే.. ఎమర్జెన్సీ టైమ్‌లో నేను ఢిల్లీ వీధుల్లోకి వచ్చి ఉండేవాడిని. నేను భారత్ జోడో యాత్రలో పాల్గొనడాన్ని.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు భావించకండి. ఐక్య భారతదేశం కోసమే నేను రాహుల్ గాంధీని కలిశాను. నాలో కోపం ఉండటం వల్లే రాజకీయాల్లోకి వచ్చాను. ఆరు దశాబ్దాలుగా నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఇచ్చిన సమాజం కోసం, ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను. నేను చాలా కోపంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లోకి రావాలని.. అది నాపై తీవ్ర ప్రభావం చూపకముందే, రాజకీయాలపై నేను ప్రభావం చూపాలని అనుకున్నాను..' అని కమల్ హాసన్ అన్నారు.
తనను తాను సెంట్రిస్ట్‌గా అభివర్ణించుకున్న కమల్.. తన మధ్యేవాద అభిప్రాయాలను అనుసరించడం ద్వారా రైట్ వింగ్ నుంచి లెఫ్ట్ వింగ్‌కు వెళ్లే వ్యక్తిగా మారిపోయానని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గుర్తింపు అని అభివర్ణించారు. అయితే ఈ భావనను నాశనం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని.. అది అంత ఈజీ కాదన్నారు. ఇందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. ప్రతి రంగంలో భిన్నత్వంలో ఏకత్వం ఉద్దేశాన్ని చెడుగా పేర్కొంటున్నారన్నారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద సాహిత్య సమావేశాలలో ఒకటి అయిన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఆదివారం కోజికోడ్ బీచ్‌లో ముగిసింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 12 దేశాల నుంచి 400 మంది వక్తలు పాల్గొని ప్రసంగించడం విశేషం.
గతేడాది డిసెంబర్ 26న ఢిల్లీ జరిగిన రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్రలో కమల్ హాసన్ పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ వైపు కమల్ మొగ్గుచూపుతున్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారానికి కమల్ హాసన్ చెక్ పెట్టారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర.. జనవరి 30న జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగుస్తుంది.
Also Read: Virat Kohli: సచిన్ రెండు రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. చరిత్రలో తొలి ఆటగాడిగా..
Also Read: విరాట్ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన టీమిండియా.. 73 పరుగులకే శ్రీలంక ఆలౌట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kamal Haasan: 'ఆ రోజు నేను ఢిల్లీ వీధుల్లో ఉండేవాడిని'.. కాంగ్రెస్‌కు మద్దతివ్వడంపై కమల్ హాసన్ క్లారిటీ
భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై స్పందించిన కమల్
దానిని తప్పుగా భావించవద్దని రిక్వెస్ట్
కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయడంపై క్లారిటీ