Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులకు చంపేస్తామని బెదిరింపు లేఖలు

Karnataka: కర్ణాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల్ని చంపేస్తామని వచ్చిన లేఖలే ఇందుకు కారణం. ఎవరిని చంపేస్తామంటున్నారు. ఎవరన్నారు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2022, 02:46 PM IST
  • ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చంటూ బెదిరింపులు
  • ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సహా 61 మంది రచయితలకు సైతం హెచ్చరికలు
  • సహనం కలిగిన హిందువు పేరుతో లేఖలు
Karnataka: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులకు చంపేస్తామని బెదిరింపు లేఖలు

Karnataka: కర్ణాటకలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రుల్ని చంపేస్తామని వచ్చిన లేఖలే ఇందుకు కారణం. ఎవరిని చంపేస్తామంటున్నారు. ఎవరన్నారు..

కర్ణాటకలో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను చంపేస్తామంటూ బెదిరింపు లేఖలొచ్చాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత హెచ్‌డి కుమారస్వామి, కాంగ్రెస్ నేత ,మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల్నించి బెదిరింపు లేఖలు విడుదలయ్యాయి. ఈ ఇద్దరితో పాటు మరో 61 మంది రచయితలకు కూడా ఇలాంటి లేఖలు వచ్చాయి. 

ఈ లేఖల అడుగున సహనం కలిగిన హిందువు అని రాసుండటం విశేషం. సిద్ధరామయ్య, కుమారస్వామిలతో పాటు మిగిలిన రచయితల్ని దేశద్రోహులుగా అభివర్ణిస్తూ లేఖలో ప్రస్తావించారు దుండగులు. బెదిరింపులు చేసిందెవరనేది ఇంకా తెలియలేదు. కానీ ఓ వర్గం పక్షాన ఉంటూ..హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని దుండగులు ఆరోపించారు. ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు, మీ అంత్యక్రియలకు సిద్ధంగా ఉండమని మీ కుటుంబసభ్యులకు చెప్పండి అంటూ లేఖలో రాశారు. మాజీ ముఖ్యమంత్రులు ముస్లింల పక్షాన ఉంటూ..హిందూ సమాజంపై విమర్శలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. వీరంతా హింతూ మత ద్రోహులని కూడా లేఖలో ఉంది. 

ఈ లేఖలపై కుమారస్వామి స్పందించారు. లేఖల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు పూర్తి భద్రత కేటాయించాని కోరారు. బెదిరింపు లేఖలతో తానేమీ భయపడటం లేదన్నారు కుమారస్వామి. మరోవైపు స్థానిక కోర్టు ఆదేశాల మేరకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన కారణంగా కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప, బీజేపీ నేత చెన్న బసప్పలపై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also read: Covid XE Variant: దేశంలో కొత్త వేరియంట్‌ కలకలం..ఐదు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News