కేబినెట్‌లోంచి తీసేస్తే.. వెళ్లి బీజేపీలో చేరుతా అని బెదిరిస్తున్న మంత్రి

కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. కేబినెట్ విస్తరించాలని అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న పలువురికి ఉద్వాసన తప్పదనే వార్తలే ఈ రాజకీయ కలకలానికి కారణమయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా వున్న ఆర్ శంకర్‌ని కేబినెట్‌లోంచి పక్కకు పెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో ఆయన నేరుగానే సర్కార్‌పై బెదిరింపులకు దిగారు. తనని శాసనసభ పక్ష సమావేశానికి ఆహ్వానించనప్పుడే తనకు అనుమానం వచ్చిందన్న మంత్రి ఆర్ శంకర్... ఒకవేళ తనను కేబినెట్‌లోంచి తొలగిస్తే, తాను బీజేపీలో చేరే అంశం గురించి ఆలోచించాల్సి ఉంటుందని పార్టీని హెచ్చరించారు.

Last Updated : Dec 22, 2018, 02:33 PM IST
కేబినెట్‌లోంచి తీసేస్తే.. వెళ్లి బీజేపీలో చేరుతా అని బెదిరిస్తున్న మంత్రి

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. కేబినెట్ విస్తరించాలని అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ప్రస్తుతం కేబినెట్‌లో కొనసాగుతున్న పలువురికి ఉద్వాసన తప్పదనే వార్తలే ఈ రాజకీయ కలకలానికి కారణమయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా వున్న ఆర్ శంకర్‌ని కేబినెట్‌లోంచి పక్కకు పెట్టే అవకాశాలున్నాయనే వార్తల నేపథ్యంలో ఆయన నేరుగానే సర్కార్‌పై బెదిరింపులకు దిగారు. తనని శాసనసభ పక్ష సమావేశానికి ఆహ్వానించనప్పుడే తనకు అనుమానం వచ్చిందన్న మంత్రి ఆర్ శంకర్... ఒకవేళ తనను కేబినెట్‌లోంచి తొలగిస్తే, తాను బీజేపీలో చేరే అంశం గురించి ఆలోచించాల్సి ఉంటుందని పార్టీని హెచ్చరించారు.

ఇదిలావుంటే, మరోవైపు తమ ప్రియతమ నేతకు ఈసారి కేబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇంకొంతమంది ఎమ్మెల్యేల మద్దతుదారులు తమ నిరసనను తెలియజేశారు. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రామలింగా రెడ్డి మద్దతుదారులు కూడా ఉన్నారు. తమ నాయకుడు రామలింగా రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ రామలింగా రెడ్డి మద్దతుదారులు బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

Trending News