Uddhav Thackeray Leaves Varsha: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసం 'వర్ష' నుంచి ఖాళీ చేసి తన సొంత నివాసమైన మాతోశ్రీకి మారారు.
Cm Uddhav Thackeray: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్..హనుమాన్ చాలీసా వివాదం మధ్య, సీఎం ఉద్ధవ్ ఠాక్రే MNS చీఫ్ రాజ్ థాకరేపై విరుచుకుపడ్డారు. ఇది కాకుండా, సీనియర్ బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ..అప్పటి శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే మధ్య సంభాషణను కూడా పంచుకున్నారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.
Navneet Kaur: మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో భయానక వాతావరణం పెరిగిపోయిందని ఆరోపించారు. ఎంపీ నవనీత్ కౌర్. ఈ నేపథ్యంలోనే హనుమాన్ జయంతి నాడు సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని తాను డిమాండ్ చేస్తున్నానని..కానీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆ పని చేయలేరని ఎంపీ నవనీత్ కౌర్ విమర్శించారు.
KCR Prakash Raj: మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ముంబయి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. భవిష్యత్తు జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పర్యటనలో నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే కేసీఆర్ తో పాటు ప్రకాష్ రాజ్ ముంబయికి వెళ్లడానికి గల కారణాలేంటో తెలుసా?
Amravati Violence: మహారాష్ట్రలోని (Amaravati news) పలు ప్రాంతాల్లో శనివారం బీజేపీ కార్యకర్తల బంద్ పిలుపు నేపథ్యంలో హింసాత్మక ఘటనలు (Amaravati violence) చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అమరావతిలో నాలుగురోజుల పాటు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నేట్ సేవలు కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మహారాష్ట్రలో ఓ వైపు కంగనా రనౌత్, మరోవైపు నేవీ మాజీ అధికారి మదన్శర్మ శివసేన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఘాటుగా స్పందించారు.
మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో నిత్యం వందలకొద్ది పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో భారత్ లోనే అత్యధిక కరోనావైరస్ కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డుకెక్కింది. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబై, పూణె నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉంది.
మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భగవత్ సాయినాథున్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఇవాళ షిరిడీలో బంద్ కొనసాగుతోంది. ఐనప్పటికీ భక్తికి బంద్ అడ్డం కాదంటూ లక్షలాది మంది భక్తులు షిరిడీ సాయినాథున్ని దర్శించుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.