కుటిల రాజకీయాలు ఆపండి: అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ నగరంలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టంపై నిరంతర నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆమ్ ఆద్మీ పై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తరుచుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీపై మండిపడ్డారు.

Last Updated : Jan 27, 2020, 04:45 PM IST
కుటిల రాజకీయాలు ఆపండి: అరవింద్ కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఢిల్లీ నగరంలోని షాహీన్ బాగ్ వద్ద పౌరసత్వ సవరణ చట్టంపై నిరంతర నిరసనలపై భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే ఆమ్ ఆద్మీ పై చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిప్పికొట్టారు. తరుచుగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై బీజేపీపై మండిపడ్డారు 

షాహీన్ బాగ్ వద్ద ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఈ విషయంలో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని, రహదారిని తెరవడానికి బీజేపీ ఎందుకు కోరుకోవడం లేదని కేజ్రీవాల్ సోమవారం ట్వీట్ చేశారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయాలపై ఆయన మండిపడ్డారు.

షహీన్ బాగ్ అంశంపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 

బీజేపీ నాయకులు వెంటనే షాహీన్ బాగ్ వద్దకు వెళ్లి  నిరసనకారులతో మాట్లాడి రహదారిని తిరిగి తెరిపించాలని  కేజ్రీవాల్ అన్నారు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు, అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ట్వీట్ లో తన స్పందనను తెలియజేశారు. 

కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వ ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ పోలీసులు పని చేస్తున్నారని, బీజేపీ నాయకులు రేచ్చగొట్టె వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆప్ నేత 
అభిప్రాయపడ్డారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News