Petrol-Diesel Prices: బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన : ధరలు తగ్గనున్నాయా

Petrol-Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెరగడమే తప్ప.తగ్గే సూచనలు కన్పించడం లేదు. అన్నివైపులా  విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Last Updated : Jan 24, 2021, 04:44 PM IST
Petrol-Diesel Prices: బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక ప్రకటన : ధరలు తగ్గనున్నాయా

Petrol-Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెరగడమే తప్ప.తగ్గే సూచనలు కన్పించడం లేదు. అన్నివైపులా  విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

నిత్యావసరంగా మారిపోయిన పెట్రోల్, డీజిల్ ధరల ( Petrol-Diesel Prices ) పెరుగుదలతో సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుగుతోంది. రోజురోజుకూ ఇంధన ధరలు ( Oil Prices ) పెరగడమే తప్ప..తగ్గే సూచనలు కన్పించకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలా నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే 90 మార్క్ దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం ( Central Government )పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ సంక్రమణ, లాక్‌డౌన్ ( Lockdown ) నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి..ఆదాయం జనరేట్ అవుతున్నా, ఇంకా ఎందుకు పెంచుతున్నారనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ( Hike in Petrol prices )

Also read: Voter ID Card: ఇక మీ ఓటరు ఐడీ కార్డును మొబైల్ నుంచే డౌన్‌లోడ్ అవకాశం

లాక్‌డౌన్ ( Lockdown ) సమయంలో ప్రపంచమంతా చమురు డిమాండ్ పడిపోయింది ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి. బ్యారెల్ ముడి చమురు గత ఏడాది 60 డాలర్ల నుంచి 19 డాలర్లకు తగ్గిపోయింది. అయినా ఇండియాలో మాత్రం ధరలు తగ్గలేదు. అనంతరం ముడి చమురు ధరలు మళ్లీ క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం 57 డాలర్లు పలుకుతోంది. లాక్‌డౌన్ సమయంలో పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచడంతో 31.93 శాతం నుంచి 32.98 శాతానికి పెరిగింది. అటు డీజిల్‌పై 15.83 శాతం నుంచి 19.98కు పెరిగింది. అంటే పెంచిన ఎక్సైజ్ డ్యూటీ ప్రకారం కేంద్రానికి అదనంగా 14 వేల 5 వందల రూపాయలు ఆదాయం లభిస్తోంది. 

పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల్నించి విమర్శలు వస్తుండటంతో పెట్రోలియం, సహజవనరుల శాఖ ( Petroleum ministry ) కేంద్రానికి లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీను తొలగించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో అదనలు సుంకాలు విధించారు ఇండియాలో. ఇప్పుడా సుంకాల్ని తగ్గించాలని ఇంధన శాఖ కోరింది. రానున్న బడ్జెట్ ( Union Budget ) ‌లో దీనికి సంబంధించి తగ్గించే ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. ఎక్సైజ్ డ్యూటీ ( Excise Duty ) ని 30-35 శాతం తగ్గించాలనేది ప్రతిపాదన. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరల్లో 5 నుంచి 7 రూపాయల మేర తగ్గవచ్చు. తద్వారా సామాన్యుడికి కాస్త ఉపశమనం లభిస్తోంది. 

Also read: Flipkart Republic Day Offer: ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక ఆఫర్లకు ఇవాళే చివరి రోజు, భారీ తగ్గింపుతో 5జీ ఫోన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News