"మే డే" సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల..!

"మే డే" సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల..!

Last Updated : May 2, 2018, 08:43 AM IST
"మే డే" సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ విడుదల..!

ప్రపంచ కార్మికుల దినోత్సవం "మే డే" సందర్భంగా గూగుల్ సంస్థ ప్రత్యేక డూడుల్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా తమ శ్రమశక్తినే నమ్ముకున్న కోట్లాది శ్రామికులకు గౌరవం ఇచ్చేందుకే ఈ డూడుల్‌‌‌కి రూపకల్పన చేసినట్లు గూగుల్ సంస్థ తెలిపింది. ఈ డూడుల్ ఆర్ట్‌లో అనేక పనిముట్లు, వస్తువులకు చోటు కల్పించింది.

రబ్బర్ గ్లౌజులు, స్టెతస్కోపులు, సెఫ్టీ హెల్మెట్లు, బ్యాటరీలు, బోల్టులు, వైర్లు, గ్లాసులు, లైట్ టార్చిలు మొదలైనవాటికి ఈ ఆర్ట్‌లో చోటు కల్పించింది. ప్రతీ సంవత్సరం వర్కింగ్ క్లాస్ ప్రజలను, శ్రామికులను గుర్తుచేస్తూ వారికి అంకితమిచ్చిన రోజే "మే డే". ఇదే రోజును లేబర్ డే అని కూడా అంటారు. ప్రపంచదేశాల్లో పారిశ్రామిక విప్లవం వచ్చి శ్రామికులు 15 గంటలు పనిచేయాలనే నిబంధనకు స్వస్తి చెప్పిన రోజు నుండి "అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని" జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది

1923లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా మేడే వేడుకలను ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు జరుపుకున్నాయి. లేబర్ కిసాన్ పార్టీ మేడే వేడుకలను తొలిసారిగా భారతదేశంలో చెన్నై కేంద్రంగా నిర్వహించింది. అనేక దేశాల్లో మేడేని పురస్కరించుకొని కార్మికులకు సెలవు దినంగా ప్రకటించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. 

Trending News