Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి.. ఇవాళే సద్భావన దివాస్ ఎందుకు ?

Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి ఇవాళ. అయితే, రాజీవ్ గాంధీ జయంతి నాడే సద్భావన దివాస్ ఎందుకు జరుపుకుంటారు ఏంటనే విషయంలోనే కొంతమంది కొన్ని సందేహాలుంటాయి. ఆ డీటేల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా రాజీవ్ గాంధీ గురించి పలు ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం.

Written by - Pavan | Last Updated : Aug 20, 2022, 05:12 PM IST
  • రాజీవ్ గాంధీ జయంతి నాడే సద్భావన దివాస్
  • రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ?
  • ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ?
Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి.. ఇవాళే సద్భావన దివాస్ ఎందుకు ?

Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి ఇవాళ. అయితే, రాజీవ్ గాంధీ జయంతి నాడే సద్భావన దివాస్ ఎందుకు జరుపుకుంటారు ఏంటనే విషయంలోనే కొంతమంది కొన్ని సందేహాలుంటాయి. ఆ డీటేల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా రాజీవ్ గాంధీ గురించి పలు ఆసక్తికరమైన సంగతులు తెలుసుకుందాం. 1944లో ఆగస్టు 20న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ దంపతులకు రాజీవ్ గాంధీ జన్మించారు. దేశ చరిత్రలో అతి పిన్న వయస్సులో దేశ ప్రధానిగా ఎన్నికైన నేత రాజీవ్ గాంధీనే. రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన వయస్సు 40 ఏళ్లు మాత్రమే. అంతకు ముందు కానీ లేదా ఆ తర్వాత కానీ మళ్లీ అంత చిన్న వయస్సులో ఆ అవకాశం ఎవ్వరినీ వరించలేదు. 

ఒకే కుటుంబం నుండి ఇద్దరు వ్యక్తులకు ప్రధానిగా సేవలు అందించే అవకాశం గతంలో ఎవ్వరికీ రాలేదు. కానీ రాజీవ్ గాంధీ వంశంలో మాత్రం దేశ ప్రధాని పదవిని చేపట్టిన వారిలో జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ మూడో వ్యక్తిగా నిలిచారు. గాంధీ కుటుంబంలో చివరి ప్రధాని కూడా ఆయనే. 1980 లో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించిన అనంతరం రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత ఆయన్ను దేశ ప్రధాని పదవి వరించింది. 

కాంగ్రెస్ పార్టీలో వంశపారంపర్య రాజకీయాలు అప్పటికి కొత్తేం కాదు. జవహార్ లాల్ నెహ్రూ తర్వాత ఆయన కూతురు ఇందిరా గాంధీని కాంగ్రెస్ పార్టీ ఆదరించింది. అలాగే ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆమె వారసుడైన రాజీవ్ గాంధీని కూడా అంతే సమానంగా అక్కున చేర్చుకుంది. ఆ కారణంగానే అప్పటికి రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులే అయినప్పటికీ.. ఆయన దేశాధినేత కాగలిగారనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూద్దాం.
- రాజీవ్ గాంధీ ఢిల్లీలోని ఫ్లయింగ్ క్లబ్‌లో విమానం నడిపేందుకు పైలట్‌గా శిక్షణ పొందారు. ఆ తర్వాత 1970లో ఎయిర్ ఇండియాలో పైలట్‌గా చేరారు. 
- రాజీవ్ గాంధీకి కారు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఎన్నికల ప్రచారానికి వెళ్లినా లేదంటే ఏదైనా పర్యటనకు వెళ్లినా ఆయన తనే సొంతంగా కారు నడుపుతూ వెళ్లేవారు. బహుశా దేశంలో అలా సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే ఆ స్థాయి రాజకీయ నాయకుడు రాజీవ్ గాంధీ తప్ప మరెవ్వరూ ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు.
- సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీని రాజకీయాల్లోకి రావాల్సిందిగా తొలుత సూచించింది శంకరాచార్య స్వామి శ్రీ స్వరూపానంద వారేనట. 
- రాజీవ్ గాంధీకి ఫోటోగ్రఫి అంటే కూడా చాలా ఇష్టం. ఆయనకు ఉన్న అభిరుచుల్లో ఫోటోగ్రఫి కూడా ఒకటి. అందుకే ఆయన మరణానంతరం ఆయన భార్య, కాంగ్రెస్ పార్టీ అధినేత్రిగా బాధ్యతలు తీసుకున్న సోనియా గాంధీ 199లో '' రాజీవ్స్ వరల్డ్: ఫోటోగ్రాఫ్స్ బై రాజీవ్ గాంధీ '' అనే టైటిల్‌తో ఓ బుక్ పబ్లిష్ చేయించారు. అంటే.. రాజీవ్ గాంధీ తీసిన ఫోటోలతో ఏకంగా ఒక పుస్తకాన్నే ప్రచురించారన్న మాట.  
ఇలా చెప్పుకుంటూపోతే రాజీవ్ గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, తన హత్యకు దారితీసిన పరిస్థితులు.. ఇలా కీలకమైన ఘట్టాలు రాజీవ్ గాంధీ జీవితంలో అనేకం ఉన్నాయి.

ఇక రాజీవ్ గాంధీ జయంతి నాడే సద్భావన దివాస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే.. శాంతిని నెలకొల్పడంలో, జాతి సమగ్రతను కాపాడటంలో, మతసామరస్యాన్ని పెంపొందించేందుకు రాజీవ్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 20వ తేదీని సద్బావన దివాస్‌గా జరుపుకుంటున్నారు. 1992లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ నేషనల్ సద్బావన అవార్డు నెలకొల్పింది. అలా రాజీవ్ గాంధీ జయంతి నాడు సద్బావన దివాస్ కూడా జరుపుకుంటున్నారు.

Also Read : KCR Munugode Meeting: ఈడీ, బోడీలకు పెట్టుకో..ఏం పీక్కుంటావో పీక్కో..మోదీపై కేసీఆర్ ధ్వజం..!

Also Read : Revanth Reddy : రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా! మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P2DgvH

Apple Link - https://apple.co/3df6gDq

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News