ఏటీఎం సెంటర్‌‌లో చిరుతపులి పిల్ల !!

దారితప్పి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన ఓ చిరుత పులి పిల్ల ఓ ఏటీఎం కేంద్రంలోకి దూరి తలదాచుకుంది.

Last Updated : Jan 28, 2019, 12:17 PM IST
ఏటీఎం సెంటర్‌‌లో చిరుతపులి పిల్ల !!

మండి: హిమాచల్ ప్రదేశ్‌‌లోని మండి జిల్లా థంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. దారితప్పి అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి ప్రవేశించిన ఓ చిరుత పులి పిల్ల ఓ ఏటీఎం కేంద్రంలోకి దూరి తలదాచుకుంది. ఏటీఎంలో చిరుత పిల్ల ఉండటం చూసిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే చాకచక్యంగా ఆ చిరుతపులి పిల్లను కాపాడి సురక్షితంగా జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో థంగ్ వాసులు సైతం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

 

Trending News