లోకో పైలట్ చంద్ర శేఖర్ లేటెస్ట్ హెల్త్ బులెటిన్

విషమంగానే లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి

Updated: Nov 12, 2019, 05:35 PM IST
లోకో పైలట్ చంద్ర శేఖర్ లేటెస్ట్ హెల్త్ బులెటిన్

హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇంజిన్ క్యాబిన్‌లోనే చిక్కుకుపోయి తీవ్రంగా గాయపడిన లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. చంద్రశేఖర్ శరీరంపై చాలా చోట్ల గాయాలయ్యాయని.. అతడు ఇంకా షాక్‌లోనే ఉన్నాడని నాంపల్లి కేర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మ వెల్లడించారు. రైలు ప్రమాదంలో చంద్రశేఖర్ కిడ్నీలు దెబ్బతిన్నాయని.. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని.. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ప్రస్తుతం వాస్క్యూలర్ ట్రీట్‌మెంట్ జరుగుతుందని డా సుష్మ చెప్పారు.

చంద్రశేఖర్ పరిస్థితిని పరిశీలిస్తే.. ఇప్పటికిప్పుడు అతడికి శస్త్రచికిత్స చేసే పరిస్థితి కనిపించడం లేదు. చంద్రశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉంటేనే అతడికి అవసరమైన శస్త్రచికిత్సల గురించి ఆలోచిస్తామని.. అదే సమయంలో ఈ ప్రమాదంలో గాయపడిన మిగతా ఐదుగురికి చికిత్స అందిస్తున్నామని డా సుష్మ తెలిపారు.