Loksabha Elections 2024 Phase 6: దేశంలో 7 దశల్లో ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటికే 5 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా రెండు దశల పోలింగ్ జరగనుంది. మే 25న ఆరవ దశ పోలింగ్ జరగనుండగా చివరి ఏడవ దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. మే 25 న జరగనున్న ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఆరవ దశలో ఏయే రాష్ట్రాల్లో ఎన్ని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి, ఎంతమంది అభ్యర్ధులు బరిలో ఉన్నారనేది తెలుసుకుందాం..
దేశంలో మే 25న జరగనున్న ఆరవ దశ ఎన్నికలు 8 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇందులో మొత్తం 58 లోక్‌సభ స్థానాలుంటే గరిష్టంగా 889 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది బరిలో ఉంటే జమ్ము కశ్మీర్లో అత్యల్పంగా 20 మంది ఉన్నారు. ఆరో దశ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి సుల్తాన్పూర్, శ్రావస్తి, ప్రతాప్‌గఢ్, ఫుల్పూర్, ప్రయాగ్ రాజ్, దుమారియా గంజ్, బస్తీ, అంబేద్కర్ నగర్, సంత్ కబీర్ నగర్, జౌన్పూర్, బదోహి, లాల్గంజ్, మఛ్లీషహర్, ఆజంగఢ్ లోక్‌సభ స్థానాలతో పాటు బల్దిరామ్ అసెంబ్లీ ఎన్నిక ఉంది. యూపీలో మొత్తం 162 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. ఇక బీహార్ నుంచి వెస్ట్ చంపారన్, ఈస్ట్ చంపారన్, వాల్మీకి నగర్, శివహర్, సివాన్, వైశాలి, మహారాజ్ గంజ్, గోపాల్‌గంజ్ స్థానాల్నించి మొత్తం 86 మంది బరిలో నిలిచారు.
ఇక హర్యానా నుంచి 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఇందులో హిసార్, కర్నాల్, అంబాలా, సోనిపట్, కురుక్షేత్ర, సిర్సా, రోహ్తక్, గురుగ్రామ్, భివానీ మహేంద్రగఢ్, ఫరిదాబాద్ స్థానాలకు కలిపి 223 మంది పోటీ చేస్తున్నారు. ఇక జమ్ము కశ్మీర్ నుంచి అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో దశలో పోలింగ జరగాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఆరో దశకు వాయిదా పడింది.
జార్ఘండ్‌లోని రాంచీ, గిరిది, ధన్‌బాద్, జంషెడ్ పూర్ లోక్‌సభ స్థానాలు, ఒడిశాలోని కియోంజర్, సింబల్‌పూర్, కటక్, దెంకనల్, పూరి, భువనేశ్వర్ లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు కూచిందా, రాయఖోల్, దేవ్‌గఢ్ అసెంబ్లీ స్తానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో ఘటల్, తమ్లుక్, కంఠి, పురూలియా, ఝుర్‌గ్రామ్, మేదినీపూర్, బంకురా, బిష్ణుపూర్ లోక్‌సభ స్థానాలున్నాయి.
Also read: OnePlus 12R: 16GB ర్యామ్, 50MP కెమేరా వన్‌ప్లస్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook