Odisha bjp mp candidate controversial statement on lord jagannath: దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది. ఇప్పటికే ఐదు విడతల్లో ఎన్నికలు సక్సెస్ ఫుల్ గా ముగిశాయి. ఈ నేపథ్యంలో.. ఆరోవిడతలో ఎన్నికల కోసం లీడర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయా నాయకులు ఎక్కువగా పబ్లిక్ మీటింగ్ లలో ఎదో ఒక కాంట్రవర్సీగా మాట్లాడుతుంటారు. కొందరు కావాలని మాట్లాడితే.. మరికొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడుతుంటారు. కొందరు కావాలని వివాదాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరు మాత్రం అనుకొండా నోరు జారీ చిక్కుల్లో ఇరుక్కుపోతుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
ఇలాంటి సమయంలో వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీరతంగా ట్రెండ్ అవుతుంటాయి. అందుకే పొలిటిషియన్స్, ఫెమస్ పర్సనాలిటీస్ లు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాని చెబుతుంటారు. ప్రస్తుతం ఒడిశా బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో నోరు జారీ అడ్డంగా బుక్కైపోయాడు. ఇప్పుడిది తీవ్ర వివాదస్పదంగా మారింది.
పూర్తివివరాలు..
ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబిత్ పాత్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తనకు భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా ప్రజలను అభ్యర్థించాడు. దేశమంతా మోదీ నాయకత్వను కోరుకుంటుందని, ప్రజలు భారీగా బీజేపీకి ఎంపీలను ఇచ్చి మంచి మెజార్టీని ఇవ్వాలని కోరారు. ఇక మరింత జోష్ లో ఆయన పూరీ జగన్నాథ్ స్వామి కూడా మోదీకి భక్తుడంటూ ఆయన మాట్లాడారు. దీంతో ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీనిపైన ఒడిశాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్రరచ్చ నడుస్తుంది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సైతం.. సంబిత్ పాత్ర వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇక.. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ప్రచారంలో నోరు జారానని, తన మాటల్లోని అర్థం అది కాదని, మన మంతా జగన్నాథుడి భక్తులమంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇక నోరు జారీనందుకు జగన్నాథుడినికి సారీ చెబుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. చేసిన తప్పుకు మూడు రోజులపాటు ఉపవాసం కూడా ఉంటానని చెప్పారు.
Read more: Viral Video: ఓవరాక్షన్ చేస్తే ఇట్లనే ఉంటది మరీ.. బొక్కొ బొర్లా పడిన యువకుడు.. వీడియో వైరల్..
ఆ దేవుడు చల్లని చూపు అందరిపైన ఉండాలని కూడా కోరుకుంటున్నట్లు సంబిత్ పాత్ర అన్నారు. ఇక ..2024 లోక్‌సభ ఎన్నికల ఆరవ దశలో పూరీ లోక్‌సభ నియోజకవర్గానికి మే 25న పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానానికి బీజేడీకి చెందిన పినాకి మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter