Maharashtra: కరోనా ఎఫెక్ట్, పది, పన్నెండు స్టేట్ బోర్డు పరీక్షలు వాయిదా

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 12, 2021, 05:45 PM IST
Maharashtra: కరోనా ఎఫెక్ట్, పది, పన్నెండు స్టేట్ బోర్డు పరీక్షలు వాయిదా

Maharashtra: మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం.

మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra government)మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ మరోమారు కల్లోలం సృష్టిస్తుండడంతో లాక్‌డౌన్‌పై సమాలోచనలు చేస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరిగిపోతుండడంతో 10, 12వ తరగతి స్టేట్ బోర్డు పరీక్షల్ని వాయిదా వేసింది.  మహారాష్ట్ర  పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ వివరాలు అందించారు.

మే నెలలో పదో తరగతి, జూన్‌ నెలలో 12వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు స్టేట్ ఎగ్జామ్స్‌ బోర్డు ( 10th and 12th Exams )షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ ఏడాది జరగాల్సిన వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్షలు జరగాల్సిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా పరిస్థితులు లేవన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు, సాంకేతిక దిగ్గజాలను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వివరించారు.

Also read: Stock market: కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో కుప్పకూలిన మార్కెట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News