West Bengal Bypoll: భవానీపూర్ నుంచి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన మమతా బెనర్జీ

West Bengal Bypoll: పశ్చిమ బెంగాల్‌లో మరో సంగ్రామానికి తెరలేచింది. బెంగాల్ లేడీ టైగర్ మమతా బెనర్జీ తాడో పేడో తేల్చుకునేందుకు భవానీపూర్ నియోజకవర్గం వేదికగా మారింది. భవానీపూర్ ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2021, 09:22 AM IST
  • పశ్చిమ బెంగాల్ ‌ మరో సంగ్రామానికి లేచిన తెర
  • భవానీపూర్ అసెంబ్లీ నుంచి పోటీకు సిద్ధమైన మమతా బెనర్జీ
  • సెప్టెంబర్ 30వ తేదీన పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్
 West Bengal Bypoll: భవానీపూర్ నుంచి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైన మమతా బెనర్జీ

West Bengal Bypoll: పశ్చిమ బెంగాల్‌లో మరో సంగ్రామానికి తెరలేచింది. బెంగాల్ లేడీ టైగర్ మమతా బెనర్జీ తాడో పేడో తేల్చుకునేందుకు భవానీపూర్ నియోజకవర్గం వేదికగా మారింది. భవానీపూర్ ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది.

దేశ వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(West Bengal Assembly Elections)ఆసక్తి రేపాయి. ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో టీఎంసీ మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడంతో తిరిగి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఎవ్వరూ ఉహించని విధంగా నందిగ్రామ్ నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి చేతిలో పరాజయం పాలవడం ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ 213 స్థానాల్ని గెల్చుకుంది. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా విధాన సభ లేదా విధాన మండలికి ఎన్నిక కావల్సి ఉంది. పశ్చిమ బెంగాల్‌లో విధాన మండలి లేకపోవడంతో ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం దీదీకు తప్పనిసరిగా మారింది. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అభ్యర్ధన, రాజ్యాంగపరంగా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ బెంగాల్‌లో మూడు స్థానాల్లో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ (West Bengal Bypoll Notification)వెలువడింది. పశ్చిమ బెంగాల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నిక సెప్టెంబర్ 30వ తేదీన జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీగా ఉంది. అక్టోబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం (Central Election Commission)షెడ్యూల్ విడుదల చేసింది. మమతా బెనర్జీ పోటీ చేసేందుకు భవానీపూర్(Bhavanipur) నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆమె కోసం ఇక్కడ్నించి విజయం సాధించిన శోవన్‌దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. భవానీపూర్ వాస్తవానికి మమతా బెనర్జీకు కంచుకోట. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల సవాలును స్వీకరించి నందిగ్రామ్‌లో పోటీ చేశారు మమతా బెనర్జీ(Mamata Banerjee). ఇప్పుడిక భవానీపూర్ నుంచి తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు దీదీ.

Also read: Aadhaar card photos update: ఆధార్ కార్డుపై మీ పాత ఫోటోను ఇలా మార్చుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News