MES Recruitment 2023: 10 తరగతితో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం..41,822 ఖాళీలు!!

నిరుద్యోగులకు ముఖ్యంగా 10 వ తరగతి పాసైన వారికి ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ గుడ్ న్యూస్ తెలిపింది. దేశం కోసం సేవ చేసే ఛాన్స్ కోసం ఎదురుచూసే వారి కోసం ఇంజినీరింగ్ సర్వీస్ లో 41 వేల కంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనుంది. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 01:14 PM IST
MES Recruitment 2023: 10 తరగతితో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం..41,822 ఖాళీలు!!

MES Recruitment 2023: దేశంపై భక్తి, దేశానికి సేవా చేయాలనే దృక్పథంతో ఇండియన్ ఆర్మీలో చేరాలని చాలా మంది యువత భావిస్తారు. అందుకోసం దేహధారుఢ్యం పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడతారు. అలాంటి యువతకు ఇది అదిరిపోయే శుభవార్త. ఇండియన్ ఆర్మీలోని మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో 41 వేల కంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రక్రియ ప్రారంభించనుంది. అందుకోసం నోటిఫికేషన్ విడుదల కానుంది. 

విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ఆర్మీలోని వివిధ పోస్టుల్లో 41822 ఖాళీలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లోని భర్తీ చేయాల్సిన సీట్లలో రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే దీనిపై పూర్తి సమాచారాన్ని త్వరలోనే విడుదల చేస్తామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. 

మిలిటరీ సర్వీస్ లోని పోస్టుల వివరాలు :
ఇండియన్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES)లో సూపర్ వైజర్, డ్రాట్స్ మన్, స్టోర్ కీపర్ లాంటి పోస్టులకు త్వరలోనే రిక్రూట్మెంట్ ప్రారంభం కానుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు, ఖాళీల వివరాలు తెలుసుకుందాం. 

భర్తీ చేయదలచిన వివరాలు:
1. ఆర్కిటెక్ట్ కేడర్ గ్రూప్ - 44
2. బ్యారక్ & స్టోర్ ఆఫీసర్ - 120
3. సూపర్‌ వైజర్ (బ్యారాక్ & స్టోర్) - 534
4. డ్రాట్స్‌ మ్యాన్  - 944
5. స్టోర్ కీపర్  - 2,026
6. మల్టీ - టాస్కింగ్ స్టాఫ్  - 11,316
7. మేట్ (MATE) - 27,920
మొత్తం: 41,822

Also Read: Xiaomi S3 Watch Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Xiaomi S3 వాచ్‌..లీకైన ఫీచర్స్‌ ఇవే..  

అభ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియ :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఆర్మీలోకి మొదట రాత పరీక్ష.. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

కావాల్సిన అర్హతలు:
ఇండియన్ మిలిటరీ ఇంజినీరంగ్ సర్వీస్ లో చేరడానికి కచ్చితంగా 10 లేదా 12వ తరగతులు ఉత్తీర్ణత అయిన వారే అర్హులు. దీనితో పాటు దరఖాస్తుకు అవసరమైన ఇతర వివరాలన్నీ పూర్తి నోటిఫికేషన్ లో పొందుపరిచారు.  

ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తారు?
మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ (MES) రిక్రూట్మెంట్ ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా జరుగుతుంది. ఇండియన్ ఆర్మీలోని ఇంజనీర్స్ కు సంబంధించిన కార్ప్స్ లో ఇదే ప్రధాన విభాగం. దేశంలో కెల్లా అతిపెద్ద నిర్మాణ, నిర్వహణ ఏజెన్లీలలో ఇదొకటి. ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది.

Also Read: avings Account: మీ అకౌంట్‌లో డబ్బులు కట్ అవుతున్నాయా..? వెంటనే ఇలా చేయండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News