Modi govt hikes Minimum Support Priceses for all Rabi Crops: దీపావళి ముందు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. దీంతో రైతుల ఆదాయం పెరగడమే కాదు పంట ఉత్పత్తులు కూడా పెరుగుతాయని తెలిపింది. ఇందులో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానిమంత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) రబీ పంటలకు మద్దతు ధర పెంచినట్లు తెలిపింది.
రబీ సీజన్ 2022-23 (జూలై-జూన్), మార్కెటింగ్ సీజన్ 2023-24 కాలానికి గానూ ఎంఎస్పీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది సీసీఈఏ. దీనికి సంబంధించిన వివరాలను అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. రబీ సీజన్ లో ప్రధాన పంటలైన గోధుమ, ఆవాలు, శనగలు, మసూర్, బార్లీ, కుసుమ పంటల ఎంఎస్పీ పెంచారు. అన్నిటికన్నా ఎక్కువగా మసూర్ ధరను క్వింటాల్ కు రూ.5౦౦ పెంచినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
కరీఫ్ పంట కాలం అయిపోగానే రబీ పంటల సీజన్ మొదలవుతుంది. అక్టోబర్ నుంచే రబీ పంటల సీజన్ ప్రారంభం అవుతుంది. ఇందులో గోధుమలు, ఆవాలు ముఖ్యమైన పంటలు. రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసే రేటునే ఎంఎసంపీ అంటారు. కరీఫ్, రబీ రెండూ కలిపి 23 రకాల పంటలకు ప్రభుత్వం ఎంఎసంపీ నిర్ణయిస్తోంది.
రబీ పంటల సీజన్ మొదలు అయిన సమయానికే గవర్నమెంటు నిర్ణయం తీసుకోవడం చాలా పరిణామం అంటున్నారు. ఇది రైతులకు మేలు చేస్తుందని కేంద్రమంత్రి తెలిపారు. దీనివల్ల రైతులు మరిన్ని లాభాలు పొందవచ్చని తెలిపారు. రైతుల ఇక మీదట దళారుల దగ్గరకు వెళ్ళక్కరలేకుండా నేరుగా ప్రభుత్వానికే పంటలు అమ్ముకునేలా ఈ ఎంఎస్పీ ధరలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రభుత్వం అందించిన ఈ దీపావళి కానుకపై రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆరు పంటల కనీస మద్దతు ధర ఇలా ఉంది:
# గోధుమల కనీస మద్దతు ధర రూ.110 పెంచారు. దీంతో క్వింటాల్ గోధుమ ధర ఇప్పుడు 2125కు చేరింది.
# బార్లీ ధరను రూ. 100 పెంచడంతో క్వింటాల్ ధర రూ.1735కు చేరింది.
# శనగల కనీస మద్దతు ధరను రూ.5230 నుంచి 5335కు పెంచారు.
# మసూర్ పంట ధర రూ.500 పెంచడంతో క్వింటాల్ మసూర్ ధర 6౦౦౦కు చేరింది.
# ఆవాలు కనీస మద్దతు ధరను రూ. 5450కు పెంచారు.
# కుసుమ పంట మద్దతు ధరను రూ. 5650 పెంచారు.
Also Read: పీపీఎఫ్‌లో కీలక మార్పులు.. అకౌంట్ ఓపెన్, డబ్బులు డిపాజిట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి!
Also Read: తెలుగు సినిమాకి పట్టిన కర్మ దరిద్రం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook