ముంబై: కరోనా వైరస్ సోకిన విషయాన్ని దాచినందుకు ముంబయి నుండి గుజరాత్‌కు ప్రయాణించిన 22ఏళ్ల ఓ వైద్యురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మే 4న ముంబయిలో ఈ వైద్యురాలికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయం ఆమెకు తెలిసినప్పటికీ మే 5న గుజరాత్‌లోని తన సొంతూరు కుచ్‌కు వెళ్లింది. అక్కడ మూడు రోజులు తిరిగిన తర్వాత మే 8న ఆమె భుజ్ ఆరోగ్య అధికారులను సంప్రదించి తనకు ముంబయిలో చేసిన కరోనా పరీక్ష నివేధిక వచ్చిందని, ఇందులో కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
దీంతో ఆమెను జీకే జనరల్ ఆస్పత్రికి తరలించా అధికారులు పేర్కొన్నారు. కాగా మే 8న తనకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు చెప్పిన ఆమె మాటలపై జీకే ఆసుపత్రి వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను సంప్రదించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కరోనా సోకిన వైద్యురాలి రిపోర్ట్‌ను గుర్తించామని, ఇందులో మే 3న ఆమెకు కరోనా టెస్టు నిర్వహించారని, ఆమె చెప్పినట్లు మే 8న కాకుండా మే 4వ తేదీనే రిపోర్ట్ వచ్చిందని ఉండటంతో ఆ వైద్యురాలిపై విపత్తు నిర్వహణ చట్టం, 2005కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..