'త్రిపుల్ తలాక్ బిల్లు'ను తిరస్కరించిన ముస్లిం లా బోర్డు

ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బి) కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం లోక్ సభలో ప్రవేశపెట్టబోయే త్రిపుల్ తలాక్ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించింది.

Last Updated : Dec 24, 2017, 05:00 PM IST
'త్రిపుల్ తలాక్ బిల్లు'ను తిరస్కరించిన ముస్లిం లా బోర్డు

లక్నో: ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బి) కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం లోక్ సభలో ప్రవేశపెట్టబోయే త్రిపుల్ తలాక్ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించింది.

హైదరాబాద్ నుంచి వచ్చిన బోర్డు కార్యదర్శి మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మాని మాట్లాడుతూ - "ఈ బిల్లు మహిళలకు వ్యతిరేకంగా ఉందని బోర్డు భావించింది. దేశంలోని సీనియర్ మతపెద్దలు, బోర్డుతో సంప్రదించి త్రిపుల్ తలాక్ పై సమీక్షించాలని ప్రధాన మంత్రి మోదీకి లేఖ వ్రాస్తాము" అన్నారు.

నేడు ఉదయం 10 గంటలకు 20 మంది సీనియర్ సభ్యులతో బోర్డు అత్యవసరంగా లక్నోలోని దరుల్ ఉలూమ్ నద్వతుల్ ఉలమాలో సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్ లో వచ్చే వారం  ప్రవేశపెట్టబోయే తక్షణ ట్రిపుల్ తలాక్ బిల్లుపై బోర్డు చర్చింది. ఈ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి బోర్డు అధ్యక్షుడు మౌలానా రబే హసన్ నదవి అధ్యక్షత వహించారు. హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసి, మహిళా సభ్యులు  అస్మా జెహ్రా (హైదరాబాద్), మందోహా మజిద్ (ఢిల్లీ) హాజరైన వారిలో ఉన్నారు. 

 

 

Trending News