Farmers Protest: రైతుల ఆందోళనపై స్పందించిన మానవ హక్కుల కమీషన్, కేంద్రానికి నోటీసులు

Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళన మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సంబంధిత ప్రభుత్వాలకు నోటీసులు పంపింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2021, 12:51 PM IST
Farmers Protest: రైతుల ఆందోళనపై స్పందించిన మానవ హక్కుల కమీషన్, కేంద్రానికి నోటీసులు

Farmers Protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళన మరోసారి వార్తల్లో నిలిచింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ ఆందోళనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. సంబంధిత ప్రభుత్వాలకు నోటీసులు పంపింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతుల ఆందోళన(Farmers Protest) కొనసాగుతోంది. ఈ ఆందోళన పలుమార్లు హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ అదుపు తప్పింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమీషన్ తీవ్రంగా స్పందించింది. మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రాజస్థాన్, హర్యానా, యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

ఆందోళన ప్రభావాన్ని ముదింపు చేయాలని కమీషన్ ఆదేశిస్తున్నట్టు తెలిపింది. శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఆందోళన నిర్వహించుకోవాలని సూచించింది. పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ సంస్థతో లెక్కించి అక్టోబర్ 10 నాటికి నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ (NHRC)కోరింది. అటు కోవిడ్ 19 ప్రోటోకాల్ ఉల్లంఘనల ప్రబావంపై జాతీయ విపత్త నిర్వహణ సంస్థ కూడా నివేదిక అందించాలని తెలిపింది. గతంలో ఆందోళన జరిగిన ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్‌రేప్ ఘటనపై ఝుజ్జర్ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా ప్రజా జీవనానికి, జీవనోపాధికి కలిగిన విఘాతంపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Also read: Tollywood: సినిమా పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి బృందం భేటీ ఖరారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News