న్యూఢిల్లీ: గత మూడు నెలల నుండి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి చైనాలోని వుహాన్ నగరం నుండి వ్యాప్తి చెంది ఇప్పుడు 200 దేశాలపై పంజా విసిరింది. ఇటలీ, స్పెయిన్ దేశాలు ఈ మహమ్మారి బారిన పడి పీకల్లోతు ఆర్ధిక ప్రాణ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇటలీలో కరోనా వైరస్ ప్రభావంతో 11,591 మంది మరణించగా, స్పెయిన్ లో 8,189 మంది మృత్యువాత పడ్డారు. చైనాలో మృతుల సంఖ్య 3,305గా నమోదుకాగా, పాజిటివ్ కేసులు లక్ష దాటిన అమెరికాలో మరణాల రేటు తక్కువగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 3,173 అని వరల్డ్ ఓ మీటర్ ఆధారంగా వెల్లడైంది.
Also Read: 3.2 లక్షల మంది కరోనా రోగుల కోసం 20,000 బోగీలతో ఐసోలేషన్ వార్డులు
మరోవైపు ఫ్రాన్స్ లోనూ కరోనా మరణమృదంగాన్ని మోగిస్తోంది. ఇక్కడ 3,024 మంది ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ లో 2,898 మంది కరోనా బారిన పడి బలయ్యారు. బ్రిటన్ లో 1,408, నెదర్లాండ్స్ లో 864, జర్మనీలో 651 మంది మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినవారి సంఖ్య 8.01 లక్షలకు చేరింది. కరోనాతో ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద 38,749 మంది మరణించినట్టు జాన్ హొప్కిన్స్ పేర్కొంది.
భారత్ లో ఇప్పటివరకు 1453 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా వీటిలో 1264 యాక్టీవ్ కేసులని, 142 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాలు వెల్లండించింది.