NCERT Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... NCERTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్..

NCERT Recruitment 2022: నిరుద్యోగ యువతకు NCERT శుభవార్త చెప్పింది. 292 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 11:17 AM IST
NCERT Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... NCERTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్..

NCERT Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.  నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)లో ప్రొఫెసర్,  అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌తో సహా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మెుత్తంగా 292 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ncert.nic.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అక్టోబరు 28 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

రిక్రూట్‌మెంట్ వివరాలు: 
దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - అక్టోబర్ 08 
దరఖాస్తుకు చివరి తేదీ - అక్టోబర్ 28
ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్/ ఓబీసీ /ఈడబ్యూసీ అభ్యర్థులకు- రూ.1000.
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి PG, Phd చేసి ఉండాలి. 
వయసు- అభ్యర్థుల వయసు 56 ఏళ్లు మించరాదు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఏజ్ రిలాక్షేషన్ వర్తిస్తుంది.
పే స్కేలు- ప్రోఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ఫ్రొఫెసర్లుకు జీతం రూ.37, 400- 67,000 వరకు ఉంటుంది. 
ఎంపిక- అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

Also read: Viral: యూపీలో దారుణం... ప్లేట్‌లెట్లకు బదులు ఫ్రూట్ జ్యూస్ ఎక్కించారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News