స్కూల్లోకి దూసుకెళ్లిన వాహనం, 9 మంది మృతి

బీహార్ లోని ముజాఫ్ఫర్పూర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

Last Updated : Feb 24, 2018, 04:04 PM IST
స్కూల్లోకి దూసుకెళ్లిన వాహనం, 9 మంది మృతి

బీహార్: బీహార్ లోని ముజాఫ్ఫర్పూర్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ వాహనం(బొలెరో) అదుపు తప్పి ఓ స్కూల్ భవనంలో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. 24 మంది విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.

సీఎం నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి

స్కూలు ఘటన పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన ఒక్కో విద్యార్థికి రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ విద్యార్థుల వైద్యం కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

 

 

Trending News