Supreme court on farmers protest: కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేనే లేదు : సుప్రీంకోర్టు

Supreme court on farmers protest: నూతన వ్యవసాయ చట్టాలపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. కమిటీ ఏర్పాటులో పక్షపాతం ఉందన్న రైతు సంఘాల ఆరోపణల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కమిటీ నియామకంలో పక్షపాతం ప్రశ్నేలేదని స్పష్టం చేసింది.

Last Updated : Jan 20, 2021, 06:31 PM IST
  • కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం
  • వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం కోసమే కమిటీ నియామకం..కమిటీకు ఎటువంటి నిర్ణయాధికారం లేదు
  • ట్రాక్టర్ ర్యాలీపై మేం ఆదేశాలివ్వలేం..ఆ నిర్ణయం పోలీసులదేనన్న సుప్రీంకోర్టు
Supreme court on farmers protest: కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేనే లేదు : సుప్రీంకోర్టు

Supreme court on farmers protest: నూతన వ్యవసాయ చట్టాలపై ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. కమిటీ ఏర్పాటులో పక్షపాతం ఉందన్న రైతు సంఘాల ఆరోపణల్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కమిటీ నియామకంలో పక్షపాతం ప్రశ్నేలేదని స్పష్టం చేసింది.

నూతన వ్యవసాయ చట్టాల ( New farmlaws )పై స్టే విధించిన సుప్రీంకోర్టు ( Supreme court ) విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలోని సభ్యుల ఎంపికపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతు సంఘాలు ఆరోపించాయి. ఈ ఆరోపణల్ని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బోబ్డే ( Chief justice s a bobde ) నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. కమిటీ ఏర్పాటులో ఎటువంటి పక్షపాతానికి తావులేదని తెలిపింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకోవడంతో కమిటీని తిరిగి నియమించాలంటూ దాఖలైన పిటీషన్ పై ప్రభుత్వ వివరణ కోరింది. మరోవైపు రిపబ్లిక్ డే నాడు ఢిల్లీ సరిహద్దుల్లో( Delhi Borders ) జరుగుతున్న రైతు నిరసనలకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వలేమని చెప్పింది. జనవరి 26న రైతులు జరపనున్న ట్రాక్టర్ ర్యాలీ ( Tractor rally ) , ఇతర నిరసనలపై నిర్ణయం తీసుకోవల్సింది పోలీసులేనని..అఫిడవిట్ వెనక్కి తీసుకోవాలని కోరడంతో..కేంద్రం అఫిడవిట్ ఉపసంహరించుకుంది.  

కేవలం వివాదం పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికే కమిటీ  ( Supreme court committee on farmlaws ) ఏర్పాటు చేశామని..ఎటువంటి న్యాయాధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలు, రైతుల ప్రయోజనం కోసమే కమిటీలో నిపుణుల్ని నియమించినట్టు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన..వారిని నిందించడం సరికాదని సుప్రీంకోర్టు  ( Supreme court ) తీవ్ర అభ్యంతరం తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలుంటాయని..అంతమాత్రాన అవి ఫలితాన్ని ప్రభావితం చేయవన్నారు. చాలా సందర్భాల్లో ఉత్తమ న్యాయమూర్తులకు నిర్ధిష్ట అభిప్రాయాల్ని పక్కనబెట్టి తీర్పులిచ్చి ఉన్నారని గుర్తు చేశారు. 

Also read: Voter ID Updation: మీ ఓటర్ ఐడీలో తప్పులున్నాయా.. నిమిషాల్లో సరిదిద్దుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News