Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. కస్టమర్స్ ఫిర్యాదు మేరకు నోటీసులు

Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్ సంస్థలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీచేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 06:52 PM IST
  • ఓలా, ఉబర్‌పై సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదుల వెల్లువ
  • తమను మోసం చేస్తున్నాయంటూ లబోదిబోమంటున్న కస్టమర్స్
  • నిబంధనల ఉల్లంఘనల కింద వచ్చిన ఫిర్యాదుల సంఖ్య వివరాలు
Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. కస్టమర్స్ ఫిర్యాదు మేరకు నోటీసులు

Ola, Uber gets CCPA Notices: ఓలా, ఉబర్ సంస్థలకు సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ షాక్ ఇచ్చింది. వ్యాపార నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణల కింద సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా వినియోగదారుల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, సేవల్లో లోపాలు, అధికమొత్తంలో క్యాన్సెల్లేషన్ చార్జీలు విధించడం, అధిక చార్జీల మోత వంటి అంశాలను ఓలా, ఉబర్ సంస్థలకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.

నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మే 1వ తేదీ మధ్య ఓలాపై 2,482 ఫిర్యాదులు అందగా.. ఉబర్ సంస్థపై 770 ఫిర్యాదులు అందాయి. గత వారం ఓలా, ఉబర్, ర్యాపిడో, మెరూ క్యాబ్స్, జుగ్నూ వంటి రైడింగ్ సౌకర్యం అందించే క్యాబ్స్ సంస్థలతో సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓ భేటీ నిర్వహించింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలు పరిష్కారం కోసం నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్‌తో కలిసి పనిచేయాల్సిందిగా సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సూచించింది. అంతేకాకుండా వినియోగదారుల చట్టం 2019, ఈ కామర్స్ నియమనిబంధనలకు లోబడి నడుచుకోవాల్సిందిగా సీసీపీఏ స్పష్టంచేసింది.

ఓలాపై వివిధ నిబంధనల ఉల్లంఘనల కింద వచ్చిన ఫిర్యాదుల సంఖ్య..
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 1వ తేదీ వరకు ఓలా క్యాబ్స్‌పై సేవా లోపాల కింద 1340 ఫిర్యాదులు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి రిఫండ్ చేయకపోవడం కింద 521 ఫిర్యాదులు, అన్‌ఆథరైజ్డ్ ఛార్జీల కింద 174, ఎంఆర్పీ కంటే అధిక మొత్తంలో చార్జీలు చేస్తున్నందుకు 139, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ వినియోగదారుల నుంచి 62 ఫిర్యాదులు, ఎకౌంట్ రద్దు చేయడం, సేవలు అందించకపోవడం వంటి సమస్యలను లేవనెత్తుతూ సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 50 ఫిర్యాదులు అందాయి.

ఇదేకాకుండా సేవల్లో జాప్యం లేదా సేవలు అందించకపోవడం వంటి సమస్యల కింద 31 ఫిర్యాదులు, లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం అందకపోవడం కింద 29 ఫిర్యాదులు, మోసపూరితమైన తప్పిదాలు పేరుతో 12 ఫిర్యాదులు, సెక్టార్ ఎంక్వైరీ పేరిట 72 ఫిర్యాదులు, ఇతర నేరాల కింద 52 ఫిర్యాదులు అందినట్టు నేషనల్ కన్సూమర్ హెల్ప్ లైన్ వెల్లడించింది.

ఇక ఉబర్‌పై నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్‌కి అందిన ఫిర్యాదుల విషయానికొస్తే.. 
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 1వ తేదీ వరకు ఉబర్ క్యాబ్స్‌పై (Uber Ride Fares) సేవా లోపాల కింద 473 ఫిర్యాదులు, చెల్లించిన మొత్తాన్ని తిరిగి రిఫండ్ చేయకపోవడం కింద 105 ఫిర్యాదులు, ఎంఆర్పీ కంటే అధిక మొత్తంలో చార్జీలు చేస్తున్నందుకు 37, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదంటూ వినియోగదారుల నుంచి 18 ఫిర్యాదులు, అన్‌ఆథరైజ్డ్ ఛార్జీల కింద 38, సేవల్లో జాప్యం లేదా సేవలు అందించకపోవడం వంటి సమస్యల కింద 17 ఫిర్యాదులు, ఎకౌంట్ రద్దు చేయడం, సేవలు అందించకపోవడం వంటి సమస్యలను లేవనెత్తుతూ సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి 50 ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అలాగే లబ్ధిదారులకు అందాల్సిన మొత్తం అందకపోవడం కింద 7 ఫిర్యాదులు, మోసపూరితమైన తప్పిదాలు కింద 11 ఫిర్యాదులు, సెక్టార్ ఎంక్వైరీ పేరిట 30 ఫిర్యాదులు, ఇతర నేరాల కింద 20 ఫిర్యాదులు అందినట్టు నేషనల్ కన్సూమర్ హెల్ప్‌లైన్ స్పష్టంచేసింది.

Also read : CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆలిండియా పర్యటన అందుకేనా..?

Also read : Gyanvapi Masjid Surve: జ్ఞాన్‌వాపి మసీదులో త్రిశూలం, ఢమరుకం! వీడియోగ్రఫీ సర్వే నివేదికలో సంచలనాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News