వన్‌ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..!

చైనాకు చెందిన వ‌న్‌ప్లస్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్లస్ 6ను కొద్దిసేపటి క్రితం భారత మార్కెట్‌లో విడుదలచేసింది.

Last Updated : May 17, 2018, 04:18 PM IST
వన్‌ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..!

చైనాకు చెందిన వ‌న్‌ప్లస్ త‌న నూత‌న ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్లస్ 6ను కొద్దిసేపటి క్రితం భారత మార్కెట్‌లో విడుదలచేసింది. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు దీని సొంతం. 6.28 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ముంబైలో జ‌ర‌గ‌నున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. కాగా ఈ ఫోన్ ప్రారంభ ధ‌ర భార‌త్‌లో రూ.35,825గా ఉండనున్నట్లు స‌మాచారం.

 

స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ప‌వ‌ర్ ఫుల్ ర్యామ్‌‌లను ఈ ఫోన్ కలిగి ఉంది. 16MP, 20MP ప‌వ‌ర్‌ఫుల్ కెమెరాల‌ సాయంతో ఫొటోలు, వీడియోలు క్వాలిటీని క‌లిగి ఉంటాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో కుడి భాగంలో అల‌ర్ట్ స్లైడ‌ర్‌ ఉంటుంది. గ‌తంలో ఎన్నడూ లేని విధంగా వ‌న్‌ప్లస్ 6 స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ వెనుక భాగంలో గ్లాస్ బ్యాక్‌ను  గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5తో ఏర్పాటు చేశారు. భారత్ లో 6జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఫోన్ ధర రూ.34,999 , 8జీబీ/128జీబీ స్టోరేజ్ కెపాసిటీ ధర రూ.39, 999, 8 జీబీ/256జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఫోన్ ధర రూ.44,700 గా ఉండవచ్చు.

వ‌న్‌ప్లస్ 6 ఫీచ‌ర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

Trending News