Covid-19 Vaccine అత్యవసర వినియోగానికి భారత్ నో!

Coronavaccine: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన తరుణంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితిలో వినియోగం కోసం భారత ప్రభుత్వం అంగీకరించలేదు.

Last Updated : Dec 31, 2020, 08:36 AM IST
    1. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన తరుణంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
    2. యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితిలో వినియోగం కోసం భారత ప్రభుత్వం అంగీకరించలేదు.
Covid-19 Vaccine అత్యవసర వినియోగానికి భారత్ నో!

Covid-19 vaccine: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రారంభం అయిన తరుణంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ కింగ్డమ్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అత్యవసర పరిస్థితిలో వినియోగం కోసం భారత ప్రభుత్వం అంగీకరించలేదు.

 

Also Read | Coronavirus Vaccine కోసం Co-WIN యాప్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం

సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటి (SEC) తన తాజా ప్రకటనలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డర్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు సూచనలు చేసినట్టు తెలిసింది. యూకే కోవిడ్-19 (Covid-19) వ్యాక్సిన్‌కు అనుమతి ఇవ్వడం ప్రస్తుతం సాధ్యం కాదు అని తెలిపింది.  యూకే వ్యాక్సిన్‌తో పాటు భారత్ బయోటెక్ తయారు చేసిన టీకాను కూడా అత్యవసర పరిస్థితిలో అందించడానికి ఇప్పటికైతే అంగీకరించడం లేదు అని తెలిపింది.

 

Also Read | 7 Wonders: ప్రపంచంలో 7 అద్భుతాలు ఇవే

కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ వినియోగంపై పూర్తి ప్రకటన చేయడానికి, ఒక నిర్ణయం తీసుకోవడానికి జనవరి 1, 2021న ఒక కీలక సమామావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలు అత్యవసర సమయంలో వ్యాక్సిన్ వినియోగం కోసం ప్రభుత్వం నుంచి అనుమతి కోరాయి. 12 వారాల వ్యవధిలో వ్యాక్సిన్ రెండు డోసులను అందించే విధంగా ఫార్మా సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. దీనిపై త్వరలో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News