భారత్-పాక్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ పదే పదే నియమనిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ చొరబాట్లకు పాల్పడుతోంది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్‌కి చెందిన ఓ హెలీక్యాప్టర్ జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో భారత గగనతలంలోకి దూసుకొచ్చి కొన్నినిమిషాల పాటు చక్కర్లు కొట్టి వెళ్లడం కలకలం సృష్టించింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్న భారత్.. ఈ ఉల్లంఘనను సైతం పాక్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రక్షణ శాఖ వర్గాల్లో చర్చనియాంశమైంది.
#WATCH A Pakistani helicopter violated Indian airspace in Poonch sector of #JammuAndKashmir pic.twitter.com/O4QHxCf7CR
— ANI (@ANI) September 30, 2018