Parliament Session: ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు

కరోనా విరామం అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. కరోనా సంక్రమణ నేపధ్యంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Last Updated : Sep 14, 2020, 11:38 AM IST
Parliament Session: ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు

కరోనా ( Coronavirus ) విరామం అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( parliament monsoon session ) ప్రారంభమయ్యాయి. కరోనా సంక్రమణ నేపధ్యంలో జరుగుతున్న సమావేశాలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దేశంలో కరోనా సంక్రమణ ప్రారంభమైన తరువాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. సుదీర్ఘ విరామం అనంతరం ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 18 రోజుల  పాటు జరగనున్నాయి. పూర్తిగా కోవిడ్ నిబంధనలకు ( Covid Guidelines ) కట్టుబడి ఈ సమావేశాలు మొదలయ్యాయి. ఈసారి శని, ఆదివారాలు కూడా సమావేశాలు జరగుతాయి. ఇప్పటికే ఉభయ సభల ఎంపీలందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు రెండు సభల్ని కలపడం భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఇదే తొలిసారి. తొలిరోజు మాత్రం ఉదయం లోక్ సభ జరగనుండగా..మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 15 అంటే రేపటి నుంచి ఉదయం రాజ్యసభ, మధ్యాహ్నం లోక్ సభ సమావేశాలు జరగనున్నాయి. 

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సిట్టింగ్ ఎంపీ వసంత్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులకు సంతాపం ( Condolences ) ప్రకటించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) సభ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు, సభ్యుల సహకారం వంటి అంశాలపై కీలక ప్రసంగం చేశారు. 45 బిల్లులు, 2 ఆర్థిక విషయాలు సహా మొత్తం 47 అంశాలు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్నాయి. Also read: Delhi Riots: జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్‌ ఖలీద్‌ అరెస్ట్‌

Trending News