Parliament Budget Session: రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం

Parliament Budget Session: పార్లమెండ్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఓ వైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు ఆర్దిక బిల్లు ఆమోదం వంటి కీలకాంశాలపై చర్చ జరగనుంది. నెల రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2021, 10:06 AM IST
  • పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం
  • ఆర్ధిక బిల్లు సహా కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం
  • ధరల పెరుగుదల, రైతుల ఆందోళన అంశాలపై ప్రభుత్వాని నిలదీయాలని నిర్ణయించుకున్న ప్రతిపక్షం
Parliament Budget Session: రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం

Parliament Budget Session: పార్లమెండ్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఓ వైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు ఆర్దిక బిల్లు ఆమోదం వంటి కీలకాంశాలపై చర్చ జరగనుంది. నెల రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి.

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Five state Assembly Elections) జరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో బిజీగా ఉన్నాయి. అదే సమయంలో కీలకమైన బడ్జెట్ రెండవ దశ సమావేశాలు (Parliament budget sessions) ఇవాళ ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లోక్‌సభ చర్చలు జరగనున్నాయి.  ఎన్నికల నేపధ్యంలో వివిధ పార్టీల ఫోకస్ క్యాంపెయిన్ మీద ఉన్నప్పటికీ సభల్లోనూ ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది. ముఖ్యంగా అధిక ధరలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ఏ అంశం మీదైనా చర్చించడానికి సిద్ధమేనని..అయితే 2021-22 గ్రాంట్ల డిమాండ్లకు, పన్ను సంస్కరణలకు సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించడానికి సహకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 8వ తేదీ వరకూ అంటే నెలరోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి.

బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని...చర్చకు కూడా సిద్ధమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Pm Narendra modi) ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ బిల్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలప్‌మెంట్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, క్రిప్టోకరెన్సీ, రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లులపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనుంది. అటు ప్రతిపక్షం కూడా ఈ సమావేశాల్లో ప్రదానంగా ధరల పెరుగుదల, రైతుల ఆందోళన, భారత చైనా సరిహద్దు ఘర్షణలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది. 

Also read: India post payments bank: పోస్టాఫీసు ఖాతాదారులు గుర్తుంచుకోవల్సిన నిబంధనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News