Passport Online: పాస్‌పోర్ట్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవచ్చు. ఏయే డాక్యుమెంట్లు అవసరం

Passport Online: విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సింది పాస్‌పోర్ట్. పాస్‌పోర్ట్ అప్లై చేయడం లేదా పొందడం ఇంతకు ముందులా కష్టమైంది కాదు. చాలా సులభంగా ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ విధానంలో పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2024, 09:28 PM IST
Passport Online: పాస్‌పోర్ట్ ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవచ్చు. ఏయే డాక్యుమెంట్లు అవసరం

Passport Online: బయటి దేశాలకు వెళ్లే ఆలోచన ఉండి పాస్‌పోర్ట్ కోసం ట్రై చేస్తుంటే ఈ వార్త మీ కోసమే. పాస్‌పోర్ట్ కేంద్రాలకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకుని అప్లై చేయవచ్చు. లేదా ఇంట్లో కూర్చుని ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ నుంచే పాస్‌పోర్ట్ కోసం అప్లై చేయవచ్చు. గతంలో అయితే పాస్‌పోర్ట్ అప్లై చేయడం, పాస్‌పోర్ట్ రావడం చాలా క్లిష్టమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. 

పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేందుకు ముందుగా మీరు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ లింక్ ఇదే https://portal2.passportindia.gov.in/. ఈ లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేశాక రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఇందులో మీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ కార్డు వివరాలు, పాస్‌పోర్ట్ కేంద్రం ఎంపిక వంటివి ఉంటాయి. 

ఈ సమాచారం ఫిల్ చేసిన తరువాత పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇందులో మీ కుటుంబం సమాచారం, విద్యార్హత వివరాలు, ఉద్యోగ సమాచారం వంటివి ఉంటాయి. పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తరువాత నిర్దేశిత పాస్‌పోర్ట్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తరువాత అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. దీనికోసం అపాయింట్‌మెంట్ లింక్ క్లిక్ చేయాలి. మీకిచ్చిన తేదీ, సమయానికి మీరు ఎంచుకున్న పాస్‌‌పోర్ట్ కేంద్రానికి వెళ్లి కొన్ని డాక్యుమెంట్లు తప్పకుండా సబ్మిట్ చేయాలి.

పాస్‌పోర్ట్ అప్లికేషన్, పాస్‌పోర్ట్ ఫీజు చెల్లించిన రిసీప్ట్, ఆధార్ కార్డు జిరాక్స్, బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకుని వెళ్లాలి. ఈ డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. అది కూడా పూర్తయితే మొత్తం 15-30 రోజుల్లో పాస్‌పోర్ట్ అందుతుంది. 

పాస్‌పోర్ట్ అప్లికేషన్ ఫీజు ఇప్పుడు 1500 రూపాయలుంది. ఇది సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు. పదేళ్ల వ్యాలిడిటీతో అందుతుంది. మైనర్లకు అయితే అంటే 18 ఏళ్లలోపున్నవారికి 5 ఏళ్లు వ్యాలిడిటీ వస్తుంది. తత్కాల్ పాస్‌పోర్ట్ అయితే 7-14 రోజుల్లో పూర్తవుతుంది. 

Also read: PF Account transfer: మీ పీఎఫ్ ఎక్కౌంట్ ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News