Paytm Fastag: పేటీఎం ఫాస్టాగ్ డిలీట్ చేయడం ఎలా, కొత్తది ఎలా తీసుకోవాలి

Paytm Fastag: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షల నేపధ్యంలో పేటీఎం వినియోగాదారుల్లో చాలా సందేహాలు తలెత్తుతున్నాయి. పేటీఎం బ్యాంకింగ్, వ్యాలెట్ సేవలు నిలిచిపోనుండటంతో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 20, 2024, 08:26 AM IST
Paytm Fastag: పేటీఎం ఫాస్టాగ్ డిలీట్ చేయడం ఎలా, కొత్తది ఎలా తీసుకోవాలి

Paytm Fastag: పేటీఎంపై ఆర్బీఐ విధించిన గడువు ఫిబ్రవరి 29 నుంచి మార్చ్ 15కు మారింది. ఈ క్రమంలో మార్చ్ 15 తరువాత పేటీఎం సేవలు చాలావరకు నిలిచిపోతాయి. ముఖ్యంగా పేటీఎం ఫాస్టాగ్ పనిచేయదు. మరి కొత్త ఫాస్టాగ్ ఎలా తీసుకోవాలి, పాతదాన్ని ఎలా డిలీట్ చేయాలనేది తెలుసుకుందాం.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ ఆంక్షల నేపధ్యంలో పేటీఎం ఫాస్టాగ్ ఇక పనిచేయదు. మార్్ 15 తరువాత పేటీఎం ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ అయిపోతే తిరిగి రీఛార్జ్ చేసుకునేందుకు వీలుండదు. మార్చ్ 15 తరువాత మరో బ్యాంకు నుంచి ఫాస్టాగ్ తీసుకోవల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సైతం పేటీఎంను అధీకృత జాబితా నుంచి తొలగించింది. ఇప్పుడిక మిగిలింది పాత పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేయడం, మరో బ్యాంకు నుంచి కొత్తది తీసుకోవడం మాత్రమే. అదెలాగో తెలుసుకుందాం.

పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేషన్‌కు మూడు మార్గాలున్నాయి. ఒకటి 1800 120 4210 నెంబర్‌కు కాల్ చేసి ప్రస్తుత ఫాస్టాగ్ ఎక్కౌంట్‌కు మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెబితే పేటీఎం సపోర్ట్ ఏజెంట్ వచ్చి మిగిలిన ప్రక్రియ పూర్తి చేస్తారు. 

ఇక రెండవది ఆన్‌లైన్ విధానంలో డీ యాక్టివేట్ చేయడం. పేటీఎం యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అందులో హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత బ్యాంకింగ్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇందులో కన్పించే ఫాస్టాగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే పేటీఎం ప్రతినిధితో మాట్లాడేందుకు చాట్ విత్ అజ్ క్లిక్ చేయాలి. అందులో వచ్చే సూచనలు మేరకు పేటీఎం ఫాస్టాగ్ ఎక్కౌంట్ డిలీట్ చేయవచ్చు.

ఇక మరో మార్గం ఫాస్టాగ్ పేటీఎంలో లాగిన్ అయి..యూజర్ ఐడీ, వ్యాలెట్ ఐడీ, పాస్‌వర్డ్ ఫిల్ చేయాలి. తరువాత ఫాస్టాగ్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇతర వివరాలతో వెరిఫికేషన్ పూర్తి చేయాలి. హెల్ప్ అండ్ సపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఐ వాంట్ టు క్లోజ్ మై ఫాస్టాగ్ ఎంచుకుని అక్కడ సూచించే ప్రక్రియ ఫాలో అయితే చాలు..ఫాస్టాగ్ డీయాక్టివేషన్ పూర్తవుతుంది. 

ఇప్పుడిక మిగిలింది కొత్త ఫాస్టాగ్ తీసుకోవడమే. పాత ఫాస్టాగ్ డిలీట్ అయితేనే కొత్త ఫాస్టాగ్ రిలీజ్ అవుతుంది. ప్లే స్టోర్ నుంచి మై ఫాస్టాగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో కన్పించే ఈ కామర్స్ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ్నించి న్యూ ఫాస్టాగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఫాస్టాగ్ ఐడీ, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు సమర్పించాలి. ఇలా కాకుండా నేరుగా హెచ్‌డిఎఫ్‌సి, ఎస్బీఐ, కెనరా ఇలా దాదాపు అన్ని బ్యాంకులు ఫాస్టాగ్ ఆఫర్ చేస్తున్నాయి. నేరుగా వెళ్లి తీసుకోవచ్చు. 

Also read: Airtel Prepaid Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు శుభవార్త, ఈ ప్లాన్స్ తీసుకుంటే అమెజాన్ ప్రైమ్ ఉచితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News