ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెంచిన పెట్రోలియం సంస్థలు, సిలెండర్‌పై 73 రూపాయలు పెంపు

LPG Gas Price: గ్యాస్ ధర మరోసారి పెరిగింది. ఎల్పీజీ గ్యాస్ ధరను ఈసారి భారీగా పెంచాయి గ్యాస్ రిటైలింగ్ సంస్థలు. సిలెండర్‌పై 73 రూపాయల వరకూ పెరగడమే కాకుండా ఇవాళ్టి నుంచి కొత్త ధర అమల్లో రానుందని ప్రకటించాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 1, 2021, 09:51 PM IST
ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరలు భారీగా పెంచిన పెట్రోలియం సంస్థలు, సిలెండర్‌పై 73 రూపాయలు పెంపు

LPG Gas Price: గ్యాస్ ధర మరోసారి పెరిగింది. ఎల్పీజీ గ్యాస్ ధరను ఈసారి భారీగా పెంచాయి గ్యాస్ రిటైలింగ్ సంస్థలు. సిలెండర్‌పై 73 రూపాయల వరకూ పెరగడమే కాకుండా ఇవాళ్టి నుంచి కొత్త ధర అమల్లో రానుందని ప్రకటించాయి.

పెట్రోలియం, గ్యాస్ రిటైలింగ్ సంస్థలు (Petroleum Companies)వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరను భారీగా పెంచాయి. సిలెండర్‌పై 73 రూపాయలు 50 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ పెరిగిన ధర కేవలం 19 కిలోల వాణిజ్య సిలెండర్‌(Commercial lpg gas cylinder price)పై మాత్రమేనని..దేశీయ సిలెండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదని వెల్లడించాయి. తాజా ధరలతో 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధర ఢిల్లీలో 1623 రూపాయలు కాగా..ముంబైలో 1579.50కు చేరుకుంది. కోల్‌కత్తాలో 1629 రూపాయలు కాగా..చెన్నైలో 1761గా ఉంది. ప్రతి నెలా 1వ తేదీన ధరల సవరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమలులో రానున్నాయి.

గృహావసరాల ఎల్పీజీ సిలెండర్(Domestic Lpg gas cylinder price) ధరల్ల ఏ మార్పులు చోటుచేసుకోలేదు. జూలై 1న గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలెండర్ ధరను 25.50 రూపాయలకు పెంచారు. ఫలితంగా ఢిల్లీ, ముంబైలలో దేశీయ సిలెండర్ ధర 834.50 రూపాయలు కాగా..కోల్‌కత్తాలో 861 రూపాయలు, చెన్నైలో 850.50 రూపాయలుంది. ఇక హైదరాబాద్‌లో ఈ ధర 887 రూపాయలుగా ఉంది. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే గ్యాస్ సిలెండర్ ధర రెట్టింపైంది. 

Also read: ఇండియాలో 49 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News