Conspiracy ON PM MODI: బ్రేకింగ్.. పాట్నాలో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర? విదేశాల నుంచి వందల కోట్ల నిధులు..

Conspiracy ON PM MODI: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర బట్టబయలైంది. ఇటీవల దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాకలాపాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర చేసిందని తేలింది.

Written by - Srisailam | Last Updated : Sep 24, 2022, 10:31 AM IST
  • ఎన్ఐఏ సోదాల్లో సంచలనం
  • ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర?
  • గత జూలైలో పాట్నాలో ప్లాన్
Conspiracy ON PM MODI: బ్రేకింగ్.. పాట్నాలో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర? విదేశాల నుంచి వందల కోట్ల నిధులు..

Conspiracy ON PM MODI: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్య కుట్ర బట్టబయలైంది. ఇటీవల దేశ వ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ కార్యాకలాపాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ప్రధాని మోడీ హత్యకు PFI కుట్ర చేసిందని తేలింది. ఈ ఏడాది జులై లో ప్రధాని మోడీ పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం జరిగిందని ఎన్ఐఏ గుర్తించింది. ప్రధానిపై దాడులు చేసేందుకు  PFI పలువురికి శిక్షణ ఇచ్చినట్లు ఎన్ఐఏకి ఆధారాలు లభించాయి.  ఇందుకోసం మారణాయుధాలు కూడా సమకూర్చుకున్నట్లు గుర్తించింది. ప్రధాని మోడీతో పాటు ఏక కాలంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన మరికొందరు ప్రముఖులపై దాడులకు కుట్ర చేసిందని తేలింది.

ఉగ్రవాద కార్యకలపాలకు సంబంధించి NIA  దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో సోదాలు జరిపింది. ఇందులో ఉగ్రవాద లింకులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 45 మందిని అరెస్ట్ చేసింది. NIAదాడుల తర్వాత PFI ఆర్థిక కార్యకలాపాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దాడులకు సంబంధించి పీఎఫ్ఐ సంస్థలు విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చాయని గుర్తించింది. విరాశాలు కూడా ఎక్కువగా నగదు రూపంలో తీసుకుని.. దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడానికి PFI కుట్రలు చేసినట్లు తేలింది.

ఈడీ అదుపులో ఉన్న పీఎఫ్ఐ సభ్యుడు షఫీక్ పైత్ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ ఏడాది జూలై 12న పాట్నాలో ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ తీశాయి. ఈ ర్యాలీలో అల్లర్లకు ప్లాన్ చేశారు షఫీక్ పైత్. అల్లర్లే లక్ష్యంగా బ్యానర్లు, పోస్టర్లు కూడా తయారు చేశారు. ర్యాలీలో అల్లర్లు ఎలా చేయాలో  షఫీక్ కొందరికి శిక్షణ కూడా ఇచ్చాడు. ఈ విషయాలను విచారణలో షఫీక్ అంగీకరించాడు. ఇక ఏడాది కాలంలోనే పీఎఫ్‌ఐ ఖాతాలో సుమారు 120 కోట్ల రూపాయలు వచ్చాయని.. దానికి రెండింతలు నగదుగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. భారతదేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కోట్ల రూపాయలు వసూలు చేసింది PFI.  ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించినట్లు ఈడీకి ఆధారాలు లభించాయి.

Also Read: HCU PROTEST: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. సెక్యూరిటీ దాడిలో విద్యార్థులకు తీవ్ర గాయాలు

Also Read: Revanth Reddy: చంద్రబాబే నన్ను కాంగ్రెస్ లోకి పంపించారు.. రేవంత్ రెడ్డి సంచలనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News