విగ్రహ విధ్వంసాలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విగ్రహాల ద్వంసంపై ప్రధాని నరెంద్రమోదీ ఘాటుగా స్పదించారు.

Last Updated : Mar 8, 2018, 09:56 AM IST
విగ్రహ విధ్వంసాలను తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న విగ్రహాల ధ్వంసంపై ప్రధాని నరెంద్రమోదీ ఘాటుగా స్పందించారు. విగ్రహాల ధ్వంసాన్ని తాను ఏ మాత్రం సహించబోనని చెప్పారు. విగ్రహాలు ధ్వంసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖను ఆదేశించారు. ఈమేరకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మోదీ మాట్లాడారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునారావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహాల ధ్వంసానికి, దాడులకు దిగితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకొని, కేసులు కూడా నమోదు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

త్రిపురలో బీజేపీ అధికారంలో వచ్చాక కొందరు దుండగులు లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. అలానే పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. మరోవైపు తమిళనాడులోనూ పెరియార్ విగ్రహంపై ఆగంతకులు దాడి చేశారు. త్రిపురలో లెనిన్ విగ్రహానికి పట్టిన గతే తమిళనాడులో పెరియార్ విగ్రహాలకు పడుతుందని బీజేపీ నేత ఫేస్బుక్ లో పోస్టు చేసిన కొద్ది గంటలకే ఈ ఘటన జరగడం కలకలం రేగింది. కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు.

మోదీతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా ఈ ఘటనలపై స్పందించారు. కొన్ని రాష్ట్రాల్లో విధ్వంసం జరగడం దురదృష్టకరమని అన్నారు. బీజేపీ పార్టీ ఇలాంటి చర్యలకు మద్దతు ఇవ్వదని చెప్పారు. విగ్రహాలపై దాడి జరిగిన రాష్ట్రాలలో పార్టీ కేడర్ తో మాట్లాడానని, ఈ దాడిలో ఎవరికైనా సంబంధం ఉంటే చర్యలు తప్పవని అమిత్ షా అన్నారు. 

Trending News