PM modi fires on Pakistan support for rahul gandhi and kejriwal: మనదేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, మనం జాగ్రత్తగా మసులుకొవాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై ఇటు బీజేపీ నుంచి అనేక మంది నేతలు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల పాక్ మాజీ మంత్రి చౌదరీ ఫవాద్ హుస్సెన్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను ఉద్దేశించి ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిలో రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ లను పొగిడినట్లు ఉంది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక మరోవైపు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల అయిన నేపథ్యంలో కూడా పాక్ నేత.. మోదీ మరో సారి ఓడిపోయారంటూ కూడా ఎక్స్ లో పోస్టు చేశారు.
Read more: Snakes crawl: బాప్ రే.. బాత్రూంలో బైటపడిన 30 కు పైగా పాములు.. షాకింగ్ వీడియో వైరల్..
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఎక్స్ లో పోస్టు చేశారు. దీనికి కూడా పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దగ్గర మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుస్సేన్ ఛౌదరి రియాక్ట్ అయ్యారు. ‘భారత్ ఎన్నికల్లో శాంతి, సామరస్యం.. బలవంతుల విద్వేషం, తీవ్రవాద శక్తులను ఓడించాలి’ అని కామెంట్ చేశారు. అయితే..ఈ ట్విట్ కు కేజ్రీవాల్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ముందు మీ దేశంలో ఆకలితో జనాలు అలమటిస్తున్నారు.. అది చూసుకొండి.. మా దేశం అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యం సహించ మంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఈ వరుస ఘటనలపై పీఎం మోదీ ఇటీవల స్పందించారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన దేశానికి పక్కలో బళ్లేంల ఉంటూ, మనకు హనీ కల్గించేవారికి వీరిపై ఎందుకంటే ప్రేమ అంటూ సెటైర్ లు వేశారు. ఇటీవల పలు సందర్భాలలో పాక్ నేతలు.. రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది కొంతమేర ఆందోళన కల్గించే అంశమని అన్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు.
అయిన భారత్ ఓటర్లు ఎంతో మెచ్యుర్డ్ ఓటర్లని, వారికి ఎవరు ఏంటో అంతా తెలుసని అన్నారు. కానీ ఈ ఘటనపై అనేక మంది బీజేపీ నేతలు కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్నారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్, జేపీ నడ్డాలు, మండి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగానా రనౌత్ ఇటీవల పాక్ ను గాజులు తొడుక్కునేలా చేస్తామంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter