ప్రధాని మోదీని కలిసిన వారణాసి రిక్షా కార్మికుడు

 ఫిబ్రవరి 16న ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఒకరోజు పర్యటనలో బాగంగా పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Updated: Feb 18, 2020, 04:39 PM IST
ప్రధాని మోదీని కలిసిన వారణాసి రిక్షా కార్మికుడు

వారణాసి: ఫిబ్రవరి 16న ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఒకరోజు పర్యటనలో బాగంగా పలు అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాగా, తన స్వంత నియోజకవర్గానికి చెందిన మంగళ్ కేవట్ అనే రిక్షా కార్మికుడు  ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వానాన్ని అందించారు. తిరిగి ప్రధాని మోదీ నుండి అభినందన లేఖ అందుకున్న మంగళ్ కేవట్ ఎంతగానో సంబరపడిపోయారు. 

మంగల్ కేవట్ ను కలిసిన ప్రధాని మోదీ, కేవట్ కుటుంబం పరిస్థితులు, ఆరోగ్యం, ఆర్ధిక పరిస్థితులపై ఆరా తీశారు. అదేరకంగా స్వచ్ఛ భారత్ అభియాయాన్ కు మంగళ్ కేవట్ చేసిన కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగల్ కేవట్, ప్రధాని మోదీ స్ఫూర్తితో తన గ్రామంలోని గంగా, నీటి సముదాయాలను స్వయంగా శుభ్రం చేయడానికి పూనుకున్నామని aniతో తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..