PM Visits Jammu: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకు మోదీ.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

PM Visits Jammu: ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూ-కశ్మీర్‌ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 09:54 AM IST
PM Visits Jammu: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జమ్మూకు మోదీ.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు!

PM Visits Jammu: ఆగస్టు 2019లో  జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir) రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)...ఆదివారం ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 4న నౌషేరా జిల్లాలో సాయుధ బలగాలతో దీపావళి జరుపుకోవడానికి మోడీ కొద్దిసేపు జమ్మూ-కశ్మీర్ సందర్శించారు. అంతకు ముందు, ఏప్రిల్ 2019లో ఆ రాష్ట్రంలో మోదీ  పర్యటించారు. 

జమ్మూ పర్యటనలో ప్రధాని మోదీ రూ. 20వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని (National Panchayati Raj Day) పురస్కరించుకుని సాంబ జిల్లాలోని పల్లీ గ్రామంలో (Palli Panchayat) మోదీ ప్రసంగించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi ka Amrit Mahotsav) వేడుకల్లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 జలవనరులను అభివృద్ధి చేసి పునరుజ్జీవింపజేసే లక్ష్యంతో 'అమృత్ సరోవర్' కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. 

మోదీ పర్యటనలో ముఖ్యాంశాలు:
** 3,100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన బనిహాల్ ఖాజీగుండ్ రోడ్ టన్నెల్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు. 
** రూ.7,500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 
**  చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రాట్లే, క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. 
** అంతేకాకుండా పల్లి గ్రామ పంచాయతీ వద్ద  500 KW సౌర విద్యుత్ ప్లాంట్‌ను మోదీ ప్రారంభించనున్నారు. తద్వారా ఇది దేశంలో "కార్బన్ న్యూట్రల్‌గా మారిన మొదటి పంచాయతీ"గా మారనుంది. 
** INTACH ఫోటో గ్యాలరీ, నోకియా స్మార్ట్‌పూర్‌ను కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. 

Also Read: Breaking: జమ్మూ & కాశ్మీర్‌లో ప్రధాని మోదీ ర్యాలీ.. 12 కిలోమీటర్ల దూరంలో పేలుళ్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News