PM Modi: పీఎం కేర్స్ నిధుల కింద 35 ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు..ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi:  దేశవ్యాప్తంగా 35 పీఎస్​ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవియా పాల్గొన్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2021, 02:48 PM IST
  • దేశవ్యాప్తంగా 35 ఆక్సిజన్​ ప్లాంట్లు నిర్మాణం
  • ప్రారంభించిన ప్రధాని మోదీ
  • పీఎం కేర్స్ నిధుల కింద ప్లాంట్స్ ఏర్పాటు
 PM Modi:  పీఎం కేర్స్ నిధుల కింద 35 ఆక్సిజన్​ ప్లాంట్లు ఏర్పాటు..ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi:  దేశవ్యాప్తంగా పీఎం కేర్స్ నిధుల(pm cares fund)తో ఏర్పాటు చేసిన 35 PSA(Pressure Swing Adsorption) ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని మోదీ ప్రారంభించారు.  ఉత్తరాఖండ్​ రిషికేశ్​ ఎయిమ్స్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఎం కేర్స్ కింద 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌(oxygen plants)ను ప్రారంభించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరాఖండ్​ సీఎం పుష్కర్ సింగ్ ధామీ(Uttarakhand Chief Minister Pushkar Singh Dhami) సహా కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్​సుఖ్​ మాండవియా(Union Health Minister Mansukh Mandaviya) హాజరయ్యారు.

Also Read: Rakesh Jhunjhunwala: ఇండియన్‌ బిగ్‌బుల్‌తో ప్రధాని భేటీ..రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలాపై ఆసక్తికర కామెంట్ చేసిన మోదీ

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పీఎం కేర్స్​ నిధులతో మొత్తం 1,224 ఆక్సిజన్ ప్లాంట్లకు నిధులు సమకూర్చారు. వీటిలో 1,100కు పైగా ప్లాంట్లలో రోజుకు 1,750 ఎంటీల ఆక్సిజన్ ఉత్పత్తి జరిగింది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే వైద్య స‌దుపాయాలు క‌ల్పించి భార‌త్ త‌న సామ‌ర్థ్యాన్ని చాటింద‌ని ప్రధాని(PM Modi)అన్నారు. మూడు వేల టెస్టింగ్ ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేశామ‌ని, మాస్క్‌ల‌ను దిగుమ‌తి చేసేవాళ్ల‌మ‌ని, కానీ ఇప్పుడు ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు. అన్ని రంగాల్లో ఎగుమ‌తి చేసే దిశ‌గా భార‌త్ దూసుకువెళ్లుంద‌ని ప్ర‌ధాని చెప్పారు. త్వరలోనే వందకోట్ల మందికి వ్యాక్సినేషన్‌(Vaccination) మైలురాయిని చేరుకోనున్నట్టు తెలిపారు ప్రధాని మోదీ. కొవిన్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టి ప్రపంచానికి భారత్‌ ఓ మార్గాన్ని చూపించిందన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News