PM Narendra Modi కలకాలం జీవించాలి: షహీన్‌బాగ్ దాదీ బిల్కిస్

ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఈ జాబితాలో షహీన్ బాగ్ ఉద్యమకారిణి 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

Last Updated : Sep 25, 2020, 05:00 PM IST
PM Narendra Modi కలకాలం జీవించాలి: షహీన్‌బాగ్ దాదీ బిల్కిస్

PM Modi is like my son says Shaheen Bagh's 'Bilkis Dadi: న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ (Time magazine) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తో సహా ఐదుగురు స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా ఈ జాబితాలో నాలుగోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చోటు దక్కించుకోగా.. షహీన్ బాగ్ (Shaheen Bagh) నిరసనను ముందుండి నడిపించిన 82 ఏళ్ల బామ్మ బిల్కిస్ బానో (Bilkis Bano), బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, బయోలజిస్ట్ రవీంద్ర గుప్తా, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ప్రభావంతమైన వ్యక్తుల జాబితాలో షహీన్ బాగ్ దాది చోటు సంపాదించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ (CAA-NRC) లకు వ్యతిరేకంగా జరిగిన షహీన్ బాగ్ ఆందోళనలో బిల్కిస్ ఎముకలు కొరికే చలిలో పాల్గొన్నారు బిల్కిస్ దాదీ. అయితే బిల్కిస్ దాదీ మరో ఇద్దరితో కలిసి సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌ నిరసన చేపట్టారు. అయితే బిల్కిస్ దాదీ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్. పదకొండేళ్ల క్రితం దాదీ భర్త చనిపోవడంతో షహీన్‌బాగ్‌లోని తన కోడలు, మనవళ్లతో నివసిస్తోంది. అయితే ఈ అత్యున్నత స్థానం లభించిన తరువాత బిల్కిస్ దాది గురువారం ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా బిల్కిస్ దాది మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తన కుమారుడి లాంటివాడేనని.. కలకాలం జీవించాలంటూ.. షహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బానో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also read: Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్ విడుదల

ఒకవేళ మోదీ మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆయన్ను కలవడానికి వెళతారా అని ప్రశ్నించగా.. ఎందుకు వెళ్లను. తప్పక వెళ్తాను.. ఇందులో భయపడటానికి ఏం ఉంది అంటూ.. షహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బానో పేర్కొన్నారు. తాను ఖురాన్ షరీఫ్ మాత్రమే చదివుకున్నానని.. బడికి వెళ్లలేదన్నారు. కానీ ఈరోజు తనకు చాలా ఆనందంగా ఉందని...  తనకు దక్కిన జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. అయితే మోదీ కూడా తన బిడ్డ లాంటివాడేనని..  ఆయనకు తాను జన్మనివ్వకపోవచ్చు.. కానీ మరో సోదరి ఆయనకు జన్మనిచ్చింది. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.. అంటూ షహీన్‌బాగ్ దాదీ సమాధానమిచ్చారు. Also read: Ram Gopal Varma: రేపే దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

దీంతోపాటు బిల్కిస్ దాదీని భారత్‌లో కరోనావైరస్ పోరాటం గురించి అడగగా.. ఆమె మన మొదటి పోరాటం కరోనావైరస్‌పైనే ఉండాలంటూ సమాధానమిచ్చారు. మొదట ఈ వ్యాధిని ప్రపంచం నుంచి నిర్మూలించాలని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. షహీన్ బాగ్ దాదీకి ఈ అత్యున్నత స్థానం లభించినందుకు ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే.. చాలారోజులపాటు కొనసాగిన షాహీన్‌ బాగ్‌ నిరసన స్థలాన్ని మార్చి 24న కోవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో తొలగించిన సంగతి తెలిసిందే. Also read: SP Balasubrahmanyam dies: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు

Trending News