న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేడు మంగళవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ జాతికి సందేశం ఇవ్వనున్నట్టు ప్రధాన మంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. మే 11న, సోమవారం నాడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన ప్రధాని మోదీ.. వారి వద్ద నుంచి ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉంది ? లాక్ డౌన్ ఎలా నడుస్తోంది అని తెలుసుకోవడంతో పాటు లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనేటటువంటి అంశాలపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను స్వీకరించారు. మే 17తో ప్రస్తుత లాక్ డౌన్ గడువు ముగిసిపోనున్న ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు రాత్రి 8 గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ( Also read : Flights and trains : మే 31 వరకు రైళ్లు, విమానాలు మాకొద్దని ప్రధానికి సీఎం విజ్ఞప్తి )
కరోనావైరస్ నివారణకు లాక్‌డౌన్‌ని ఇంకొంత కాలం పొడిగించాల్సిన అవసరం ఉందన్నట్టుగా కొంతమంది ముఖ్యమంత్రులు తమ అభిప్రాయాలు వినిపించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ రాత్రి ఏం చెప్పనున్నారనేదే ప్రస్తుతం అందరిని ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇప్పటికే మార్చి 24 నుంచి దేశం లాక్ డౌన్‌లో ఉండటంతో నిరుపేదలు చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ( Also read : రాష్ట్రంలో కొత్తగా 79 COVID-19 పాజిటివ్ కేసులు )
ప్రధాని మోదీ విధించిన లాక్‌డౌన్‌ని ఫెయిల్యూర్‌గా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించి జనాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం లాక్ డౌన్‌ని పొడిగిస్తేనే.. తమ రాష్ట్రంలో కరోనావైరస్ నివారణకు మార్గం సుగుమం అవుతుందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్‌పై ప్రధాని మోదీ చేయబోయే ప్రకటన ఏదైనా... అది యావత్ దేశ ప్రజానికానికి కీలకంగానే మారనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..