Covid-19 Vaccine: నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ (Coronavirus) వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2021, 06:51 AM IST
Covid-19 Vaccine: నేడు సీఎంలతో ప్రధాని మోదీ భేటీ

PM Narendra Modi virtual meet with states CM's Today | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనావైరస్ వ్యాక్సిన్ (Coronavirus Vaccine) డ్రైవ్ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై ఈ రోజు సాయంత్రం సీఎంలతో భేటీ కానున్నారు. ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం 4గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అవుతారని అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

తొలి దశలో 30 కోట్ల మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, ఆరోగ్య కార్యకర్తలు, ఆ తర్వాత వృద్ధులకు ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ముందుగా 3కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలకు (Coronavirus) వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. ఈ మేరకు పలు నగరాల్లో వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించిన ఏర్పాట్లను సైతం కేంద్రం పూర్తి చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, రవాణా వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ సీఎంలతో చర్చించనున్నారు. Also Read: Covaxin: భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ మృతి

ఇదిలాఉంటే.. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) ఆక్స్‌ఫర్డ్ - సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్‌, దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్ (covaxin, covishield) కోవిడ్ (Covid-19) వ్యాక్సిన్లను దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. Also read: Balakot airstrikes: ఆ దాడుల్లో 3 వందలమంది మరణించారని ధృవీకరణ

Also Read: Farmers Protest: విషం తాగి రైతు బలవన్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News