Narendra Modi: ట్విటర్‌లో మోదీ హవా

ప్రధాని నరేంద్ర మోదీకి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. 

Last Updated : Jul 19, 2020, 04:01 PM IST
Narendra Modi: ట్విటర్‌లో మోదీ హవా

PM Modi twitter account: న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) కి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై విపరీతమైన ఫాలోయింగ్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దేశం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌ ( twitter ) ద్వారా మరో ఘనతను సాధించారు. తాజాగా ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ను అనుసరించే (followers) వారి సంఖ్య ఇప్పుడు ఆరు కోట్లకు పైగా పెరిగింది. అయితే ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా 2,354 మందిని అనుసరిస్తున్నారు. Also read: Rajasthan: కాంగ్రెస్ ఎమ్మెల్యేల అంత్యాక్షరి.. వీడియో వైరల్ 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర నాయకుల్లో ప్రధాని మోదీ కూడా ఒకరు. 2009 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ ట్విటర్‌ అకౌంట్‌ (twitter account) ను ప్రారంభించారు. అప్పటినుంచి ఆయన ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయాన్ని పంచుకుంటున్నారు. పాలనా, రాజకీయ పరమైన ప్రతీ విషయాలను మోదీ క్రమం తప్పకుండా ట్విటర్‌ వేదికగా ప్రజలతో పంచుకుంటారు. Also read:పాలకుల దేశభక్తికి, దూర దృష్టికి ఆయనే నిలువెత్తు నిదర్శనం: ఉపరాష్ట్రపతి

ఇదిలాఉంటే.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ట్విటర్ ఫాలోవర్స్ కలిగి ఉన్న రాజకీయ అగ్ర నాయకుల్లో ప్రధాని మోదీ మూడో స్థానంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా 12 కోట్ల 70 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌ 8 కోట్ల 37 లక్షలకు పైగా ఫాలోవర్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.  
Also read: AP Capital: ఇక కొత్త రాజధానులు త్వరలో ప్రారంభం

Trending News