Central Govt: కొవిడ్ ఎఫెక్ట్: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం!

Central Govt: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 08:57 PM IST
Central Govt: కొవిడ్ ఎఫెక్ట్: ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం!

Pregnant women, Divyang employees to be exempted from attending office: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గర్భిణీ స్త్రీలు (Pregnant women), దివ్యాంగులు (వికలాంగులు) ఉద్యోగులకు విధులకు హాజరుకాకుండా మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ (Union Minister Jitendra Singh) ఆదివారం ప్రకటించారు. వారికి ఇంటి నుంచి పని చేసే (Work From Home) వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

కొవిడ్​ కంటైన్​మెంట్​ జోన్లలో (Covid Containment Zones) నివాసం ఉంటున్న అధికారులు, ఇతర సిబ్బందికి కూడా మినహాయింపు ఉంటుందని జితేంద్ర సింగ్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కార్యదర్శి కంటే కిందిస్థాయి ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మిగతా 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జాబితా సిద్ధం అవుతుందని ప్రకటించారు. 

Also Read: Corona Spread Rate: అత్యంత వేగంగా కరోనా సంక్రమణ, ఒకరి నుంచి నలుగురికి వ్యాప్తి

వర్క్​ ఫ్రం హోం (Work From Home) చేసే ఉద్యోగులు.. టెలిఫోన్​, ఇతర ఎలక్ట్రానిక్​ సాధనాల ద్వారా అందుబాటులోనే ఉంటారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అధికారిక సమావేశాలను దాదాపు వీడియో కాన్ఫరెన్స్​ పద్ధతిలోనే నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ రూల్స్ జనవరి 31వరకు అమల్లో ఉండనున్నట్లు ప్రకటనలో తెలిపింది. దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో..కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News