లక్నోలో డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభం
మూడు రోజులపాటు జరగనున్న ప్రదర్శన
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెగా డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ డిఫెన్స్ ఎక్స్‌పో ను ప్రారంభించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు. The Defence Expo 2020 పేరుతో జరుగుతున్న ఈ ప్రదర్శనలో రక్షణ రంగానికి సంబంధించిన ఆయుధాలు, వాటి పరికరాలు ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో రక్షణ రంగంలో పరికరాలు తయారు చేస్తున్న మాన్యూఫ్యాక్చరర్స్ పాల్గొంటున్నారు. ఈ రోజు ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల 8 వరకు జరుగుతుంది. రక్షణ రంగంలో ఆయుధాలు, వాహనాలు, ఉపకరణాలు తయారు చేస్తున్న ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల తయారీదారులు ప్రదర్శనకు వచ్చారు. అందరూ తమ తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా ఈ ప్రదర్శన వల్ల రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతా ఒకే గొడుకు కిందకు వచ్చినట్లు కనిపిస్తోంది.
రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచానికి ఉగ్రవాదం పెను సవాల్‌గా మారిందన్నారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందు కోసం ప్రతి దేశం రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 25 ఉత్పత్తులను ఉత్పత్తి చేయడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. డిఫెన్స్ ఎక్స్‌పో ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన తర్వాత జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
#WATCH Lucknow: Prime Minister Narendra Modi at the inaugural ceremony of the DefExpo 2020. Union Defence Minister Rajnath Singh and Chief Minister Yogi Adityanath also present. #DefenceExpo2020 pic.twitter.com/BKas2Bz5Kn
— ANI UP (@ANINewsUP) February 5, 2020